వారసుడు వస్తున్నా వేళ విశేషం..బుచ్చి బాబుకు బిగ్ రాడ్ దించేసిన చరణ్..!

సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చిన దర్శకులలో బుచ్చిబాబు సాన తన మొదటి సినిమా ఉప్పెనతో అదిరిపోయే ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి సినిమాతోనే అలాంటి సూపర్ హిట్ అందుకున్న ఈ దర్శకుడు తర్వాత సినిమాలపై ఎన్నో ఎక్స్పెక్టేషన్లు వ‌చ్చ‌యి. ఆ అంచనాలకు తగ్గట్టు తన తర్వాత సినిమాని జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తున్నానని ప్రకటించాడు. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా జరగగా ఈ సినిమా అనౌన్స్మెంట్ అవుతుందన్న సమయంలోనే ఎన్టీఆర్- బుచ్చిబాబు ప్రాజెక్ట్‌కు నో చెప్పాడు.

Jr NTR To Collaborate With Director Buchi Babu Sana In A Film Titled, Pedhi

ఆ తర్వాత తన రెండో సినిమాను కొన్ని రోజుల తర్వాత రామ్ చరణ్ తో అనౌన్స్ చేశాడు. ఈ సినిమాతో అయినా తన కష్టాలు తీరి 2023 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని కామెంట్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ డైరెక్టర్‌కు మరో బిగ్ షాక్ తగిలిందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. చరణ్- బుచ్చిబాబు సినిమాకు ఓకే చెప్పినా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి ఇంకా చాలా సమయం పడుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో తన 15వ సినిమాలో నటిస్తున్నాడు.

Ram Charan, Buchi Babu Sana team up for a sports drama- Cinema express

ఈ సినిమా పూర్తయిన వెంటనే మరో క్రేజీ దర్శకుడు నర్తన్ తో ఓ సినిమా చేయడానికి చరణ్ ఓకే చెప్పినట్టు కామెంట్లు వినిపిస్తున్నాయి. బుచ్చిబాబు సినిమా కన్నా ముందే చరణ్ నర్తన్‌తో సినిమా చేయాలనుకుంటున్నాడని తెలుస్తుంది. రామ్ చరణ్ మాత్రం ఆ విధంగా చేస్తే బుచ్చి బాబుకు ఇదే పెద్ద షాకే అని చెప్పాలి. తన మొదటి సినిమా వచ్చి నాలుగు సంవత్సరాల వస్తున్న ఇప్పటికే తన రెండో సినిమా మొదలుపెట్టలేదు.

ఈ క్రమంలోనే చరణ్ బుచ్చిబాబు గురువు సుకుమార్ తో కూడా సినిమా చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే సుకుమార్- రామ్ చరణ్ తో చేయబోయే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసినట్టు తెలిసింది. రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా ఆలస్యంగా మొదలవుతుందో లేదో ఈ సినిమాపై ఒక స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఈ విషయంపై త్వరలోనే ఈ సినిమా యూనిట్ క్లారిటీ ఇస్తుందో లేదో తెలియాల్సి ఉంది.