న‌య‌న్ స‌రోగ‌సి వివాదం కావ‌డానికి అదే కార‌ణం.. వ‌ర‌ల‌క్ష్మి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

వరలక్ష్మి శరత్ కుమార్.. పాజిటివ్ రోల్స్ మాత్రమే కాకుండా నెగటివ్ రోల్స్ కూడా చేస్తూ కుర్ర కారును ఎంతగానో ఆకట్టుకుంటుంది. కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. వెండితెరపై విభిన్నమైన పాత్రలతో అలరిస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.

వరలక్ష్మి తన నటనతో `క్రాక్` మరియు `నాంది` సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. తాజాగా నటి సమంత ప్రధాన పాత్రలో కనిపించనున్న `యశోద` సినిమాలో వరలక్ష్మి కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో నవంబర్ 11వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే మొదలయ్యాయి.

ఈ ప్రమోషన్స్ లో పాల్గొన్న వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో తాను అద్దె తల్లిని సమకూర్చిన డాక్టర్ గా నటించానని చెప్పింది. అయితే ఈ కథ వినగానే తాను ఎంతో ఆశ్చర్యపోయానని అలాగే అద్దె తల్లి విధానం గురించి ఇటీవలే పెద్ద చర్చ జరిగిందని.. నిజానికి అంత పెద్ద సమస్య కాదని ఆమె పేర్కొంది. అయితే నయన్ మరియు విఘ్నేష్ శివన్ వివాదం జ‌ర‌గ‌డానికి.. వారు సెలబ్రిటీస్ కావడం కారణమని అందుకే అంత పెద్ద వివాదం జరిగిందని వరలక్ష్మి చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా ఈ సినిమాలో అద్దె తల్లి విధానం తప్ప? రైటా? అన్నది చెప్పలేదని సమాజంలో ఇలాంటి వారు కూడా ఉన్నారని చెప్పడమే ఈ సినిమా యొక్క ప్రధాన ఉద్దేశం అని ఆమె వ్యాఖ్యానించింది. ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Share post:

Latest