త‌మ‌న్నాకు చెస్ ట్రైన‌ర్‌గా మారిన ప్ర‌భాస్‌.. వైర‌ల్‌గా మారిన వీడియో!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కు దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాకుండా తాను సెట్ లో ప్రవర్తించే తీరుకు దర్శక నిర్మాతలు, నటీనటులతో సహా అందరూ ఎంతగానో ఆకర్షించబడతారు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. డార్లింగ్ ప్రభాస్ సినిమాలు కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు.

ఇక ఇటీవల రిలీజ్ అయిన `ఆదిపురుష్` టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే తాజాగా ప్రభాస్ కు సంబంధించిన ఓ పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో మిల్కీ బ్యూటీ తమన్నకు చెస్ గేమ్ నేర్పిస్తున్న ప్రభాస్ వీడియో అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఆ వీడియో `రెబల్` సినిమా షూటింగ్ టైంలోది. అయితే తమన్నా ప్రభాస్ జంటగా నటించిన `రెబల్` సినిమా మంచి హిట్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈ షూటింగ్ గ్యాప్ లో ప్రభాస్ తమన్నా వైట్ అండ్ వైట్లో ముఖం మీద బ్లడ్ పడినట్టు ఫుల్ పవర్ ఫుల్ లుక్ లో చెస్ ఆడుతూ కనిపిస్తున్నారు. అయితే ఆ లుక్ రెబల్ సినిమా క్లైమాక్స్ షూటింగ్ సమయంలో అని తెలుస్తుంది. ఈ వీడియో చూసినవారు తమన్నకు చెస్ ట్రైనర్ గా మారిన ప్రభాస్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం వీరిద్దరూ చెస్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం సలార్,ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పటికే `ఆదిపురుష్` సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అంతేకాకుండా డైరెక్టర్ మారుతీ డైరెక్షన్లో‌ ప్రభాస్ ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు.