అందాల తార శ్రీదేవి గారాలపట్టి జాన్వీ కపూర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తొలి చిత్రం ‘ధడక్’తోనే తనదైన మార్క్ వేసిన అందగత్తె జాన్వీని ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడతారు. ఆ సినిమా తర్వాత జాన్వీకి తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. వరుసగా బాలీవుడ్లో సినిమాలు మంచి బీజీగా గడుపుతోంది. తాజాగా ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా తండ్రి బోనీ కపూర్ తో కలిసి జాన్వీ హైదరాబాద్ వచ్చింది. ఈ సందర్భంగా మంచి కథ దొరికితే త్వరలో తెలుగు సినిమాలలో నటిస్తానని ఓ తీపికబురు చెప్పింది.
అవును, ఈ సందర్భంగా జాన్వీ కపూర్ సౌత్ ఇండస్ట్రీ ఎంట్రీ పై ఉన్న అనుమానాలను పటా పంచలు చేసారు ప్రముఖ నిర్మాత బోనీ కపూర్. ఈయన తెలుగులో అంతం, వకీల్ సాబ్ సహా పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన సంగతి విదితమే. త్వరలో జాన్వీ NTR సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతన్నట్టు కూడా గుసగుసలు వినబడుతున్నాయి. ఇక జాన్వీ కపూర్ ఓ వైపు సినిమాలతో నిమిషం ఖాళీలేకుండా గడుపుతూనే మరోవైపు అప్పుడపుడు తన వెకేషన్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది.
తాజాగా జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అచ్చమైన అచ్చతెలుగు శారీతో అభిమానులకు కనులవిందు చేస్తోంది. కాగా సోషల్ మీడియాలో సదరు పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఆయా ఫోటోలను చూస్తున్న నార్త్ నెటిజన్స్ జాన్వీ ఇంకా హైద్రాబాద్‌లోనే సెటిల్ అయిపోతుందేమో అని భయబ్రాంతులకు గురవుతున్నారు. ఆమె సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె రూహీ, తక్త్, గుడ్ లక్ జెర్రీ, హెలెన్ మొదలగు సినిమాల్లో నటిస్తోంది. జాన్వీ తాజాగా ముంబైలోని జుహు ప్రాంతంలో 39 కోట్ల రూపాయలతో ఓ ఖరీదైన ఇంటిని సొంతం చేసుకుందనే విషయం విదితమే.