ఆ పాపమే రష్మిక పాలిట శాపంగా మారిందా.. ఆ ఒక్క తప్పు మాట అనకుండా ఉంటే ఎంత బాగుండో..!

కన్నడ చిత్ర పరిశ్ర‌మ‌ నుంచి తర్వాత సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న భామ రష్మిక మందన్నా. అతి తక్కువ సమయంలోనే మంచి అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్ స్టేట‌స్‌ను దక్కించుకుంది. ఇక గత సంవత్సరం వచ్చిన పుష్ప సినిమాతో రష్మిక ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ రేంజ్ కు వెళ్ళింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో కూడా రష్మిక పలు సినిమాలలో నటించింది. ఆ సినిమాలు కూడా విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఇప్పుడు రష్మిక అనుకోని వివాదంలో చిక్కుకున్నట్టు తెలుస్తుంది. ఏకంగా రష్మికను బ్యాన్ చేసే పరిస్థితి ఎదురవుతున్నట్లు తెలుస్తుంది. రష్మి కన్నడ చిత్ర పరిశ్రమంలో తన సినీ రంగ ప్రవేశం చేసింది. కన్నడలో రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కిరాక్ పార్టీ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటించింది. మొదటి సినిమాతోనే అదిరిపోయే హిట్ అందుకున్న రష్మిక. తర్వాత ఆ సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో ప్రేమలో పడి ఎంగేజ్మెంట్ జరిగి పెళ్లి మధ్యలో ఆగిపోయింది.

తర్వాత రష్మిక టాలీవుడ్ లో వరుస సినిమాలలో నటించి స్టార్ డమ్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే రీసెంట్గా రష్మిక పాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ హిట్ అయిన కాంతారా సినిమాపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆ కామెంట్‌లు కాస్త ఆమెకు ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఆమెను కాంతారా సినిమా గురించి అడగక ‘నేను ఆ సినిమా చూడలేదు నాకు టైం కుదరలేదని సమాధానం ఇచ్చింది’.

Kantara: ಜನಮೆಚ್ಚಿದ 'ಕಾಂತಾರ' ಬಗ್ಗೆ ರಶ್ಮಿಕಾ ಮೌನ; ಮೊದಲ ಚಿತ್ರದ ನಿರ್ದೇಶಕರನ್ನೇ ಮರೆತ್ರಾ ಕಿರಿಕ್​ ಪಾರ್ಟಿ ನಟಿ? - Rashmika Mandanna maintain silence about Kantara Kannada movie success ...

దీంతో పాటు మీకు మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చింది అని అడగగా ‘రష్మిక ఏదో సో కాల్డ్ బ్యానర్ లో నాకు సినిమా అవకాశం వచ్చిందని ఆ నిర్మాణ సంస్థ పేరు కూడా ప్రస్తావించడానికి ఇష్టపడలేదు’. ఇక ఆమె కన్నడ పరిశ్రమను తక్కువ చేసి మాట్లాడుతుందని ఆమె మీద ట్రోలింగ్‌లు కూడా బాగా జరిగాయి. ఈ విషయంపై కాంతారా హీరో కమ్‌ దర్శకుడు రిషబ్ శెట్టి కూడా రష్మికపై తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు ఏకంగా రష్మికను కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి నిషేధించాలని సోషల్ మీడియా వ్యాప్తంగా కన్నడ సినిమా అభిమానులు కామెంట్‌లు చేస్తున్నారు.

Share post:

Latest