నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్దబ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో చూశాం. బాలయ్య కెరీర్లోనే అఖండ బిగ్గెస్ట్ హిట్ అవ్వడంతో పాటు ఏకంగా రు. 200 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాకు థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పిచ్చ హైలెట్ అయ్యింది. చాలా థియేటర్లలో అఖండ బీజీఎం దెబ్బకు బాక్సులు పగిలిపోయాయి. దీంతో చాలా థియేటర్లు తమ సౌండ్ సిస్టమ్ వాల్యూమ్ తగ్గించుకుంటున్నట్టు చెప్పాయి.
అమెరికాలో ఓ థియేటర్లో బాక్సులు పగిలి పోవడంతో అక్కడ థియేటర్లు కూడా తాము సైడ్ బాక్సులు ఆపేశామని చేసిన ప్రకటన కూడా అప్పట్లో హైలెట్ అయ్యింది. ఇప్పుడు వీరసింహారెడ్డికి కూడా అదే పరిస్థితి రానుందా ? అంటే థమన్ చేసిన పోస్టు చూస్తే అవుననే తెలుస్తోంది. అసలు సినిమా ఫస్ట్ సాంగ్ రాకముందే బాక్సులు పగిలిపోయాయి.
తాజాగా వచ్చిన జై బాలయ్య సాంగ్ లిరికల్ సాంగ్ దెబ్బకి సౌండ్ వూఫర్ బద్దలయ్యిపోయింది అంటూ థమన్ ఓ ఫోటో షేర్ చేసి సినిమాపై మరింత ఎగ్జైట్మెంట్ పెంచాడు. ఇక ఈ రోజు వచ్చిన సాంగ్లో లిరిక్స్ అయితే పేలిపోయాయి. బాలయ్య క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్గా ఉందో సాంగ్ చెప్పకనే చెప్పేసింది. మరి ఈ సాంగ్ సోషల్ మీడియాను ఇప్పటికే షేక్ చేస్తుండగా.. రేపు థియేటర్లలో బాక్సులు ఎలా బద్దలు కొడుతుందో ? చూడాలి.
Just Now Saw the Final Lyrical Video & Final Sound of #jaiballaya Masss Anthem 🔥🔥🔥🔥🔥🔥🔥
Can’t wait 🔊🔊🔊🔊🔊🔊🔊🔊🔊🔊🔊#VeeraSimhaaReddy First Single 💪🏼
Subwoofer 🤣 pic.twitter.com/gRs8AAFYLT
— thaman S (@MusicThaman) November 25, 2022