వేదికపైనే రాధికను ర్యాగింగ్ చేసిన బాలయ్య.. ఏమని సమాధానం చెబుతుందో మరి?

సీనియర్ నటులు బాలయ్య – రాధికల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. బాలయ్య ఇప్పటికీ తన లెగసీని కొనసాగిస్తుంటే, రాధిక తనదైన పాత్రలను చేస్తూ వెండితో పాటు బుల్లితెరపై కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇకపోతే తెలుగు OTT ఆహా లో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో గురించి కూడా జనాలకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలయ్య హోస్టు చేసిన ఈ షో సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి విదితమే. కాగా ప్రస్తుతం సీజన్ II నడుస్తోంది. ఇక ఈ షో ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా గుర్తింపు తెచ్చుకుంది.

ఈ క్రమంలోనే 2వ సీజన్ కూడా సూపర్ సక్సెస్ అవుతోంది. తాజాగా రెండవ సీజన్లో ఊహించని విధంగా రాజకీయ నాయకులను షో కి పిలిపించి, వారితో పటు ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ రాధికను కూడా పిలిచారు. మాజీ స్పీకర్ కేతిరెడ్డి సురేష్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా ఇక్కడకు విచ్చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా వుంది. బాలయ్య తన స్నేహితులతో తనదైన పంచులు వేసిన తరువాత అక్కడికి రాధిక ఎంటర్ అవుతుంది.

ఈ సందర్భంగా కొన్ని కామెడీ మాటలు వారిమధ్య సాగుతాయి. ఆ తరువాత బాలయ్య ఎవరూ ఊహించని విధంగా రాధికను ర్యాగింగ్ చేసే విధంగా… ‘చిరంజీవితో అనేక సినిమాలు చేసావు కదా, అతనిలో నీకు నచ్చనిది ఏంటి? నాలో నీకు నచ్చిందేంటి?’ అంటూ రాధికని ఇరకాటంలో పెట్టే ప్రశ్న వేసాడు బాలయ్య. ఈ ప్రశ్న వినగానే ఆడిటోరియంలో జనాలు కూడా అవాక్కయ్యారు. అయితే ఈమె సమాధానం చెబుతుందా? లేదా? అనేది ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు మనకు తెలియదు. ఇకపోతే అప్పట్లో చిరంజీవి – రాధిక జోడి సిల్వర్ స్క్రీన్ పైన అదరగొట్టిన సంగతి తెలిసినదే.

Share post:

Latest