మలయాళం సూపర్ హిట్ అయినా దృశ్యం 2 ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆలస్యంగా హిందీలో రీమేక్ అయ్యి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోగా నటించిన అజయ్ దేవగన్ తో పాటు హీరోయిన్ శ్రియ మరియు కీలక పాత్రలో నటించిన టబు కూడా సందడి చేశారు. సినిమా యొక్క ప్రత్యేక ప్రీమియర్ షో కి పెద్ద ఎత్తున తారలు తరలిరావడంతో మరింత సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా అజయ్ దేవగన్ తన భార్య కాజోల్ తో హాజరవగా.. శ్రియ కూడా తన భర్తతో హాజరయ్యింది.
ఇకపోతే ప్రమోషన్స్ లో భాగంగా శ్రీయ స్టేజిపై అందరి ముందు తన భర్తకు లిప్ కిస్ ఇచ్చిన దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇకపోతే గతంలో కూడా శ్రీయ తన భర్త ఆండ్రూ ని లిప్ కిస్ పెట్టుకోవడం మనం ఇప్పటికే ఎన్నో ఫోటోలలో చూసాం. కానీ ఈసారి సినిమా ప్రీమియర్ షో కి హాజరైన సందర్భంగా ఇలా లిప్ కిస్ పెట్టుకోవడం చూస్తే వీరు హాలీవుడ్ వారిని మించి పోతున్నారు అంటూ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అంతమంది వుండగా.. మీడియా ముందు మరియు ఎంతోమంది సినీ ప్రముఖులు ఉన్న సమయంలో కూడా ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు.
దృశ్యం 2 సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో వీరి ముద్దు దృశ్యమే భలే ఉంది అంటూ మరికొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలా ప్రమోషన్స్ లో భాగంగా తన భర్తకు లిప్ కిస్ ఇచ్చి మరొకసారి వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ. మరొక పక్క ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలపైనే అవుతున్నా.. హీరోయిన్గా క్రేజ్ మాత్రం తగ్గలేదు.. మొత్తానికైతే అందాల ఆరబోతతో కూడా మరింత పాపులారిటీ దక్కించుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.