ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్… సొంత సంస్థపై GST రైడ్స్, బుక్కైన బాహుబలి!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. టాప్ ప్రొడక్షన్ హౌస్ లో యూవీ క్రియేషన్స్ సంస్థ ఒకటి. కాగా ఇది మన బాహుబలికి చెందిన ప్రాపర్టీ అని చెలమందికి తెలిసే ఉంటుంది. కాగా ఈ సంస్థ మీద GST అధికారులు తాజగా రైడ్స్ జరిపారు. దాంతో ఒక్కసారిగా టాలీవుడ్ వర్గాల్లో దుమారం చెలరేగింది. UV క్రియేషన్స్ సంస్థ పన్ను ఎగవేసినట్లు GST అధికారులు భావిస్తూ మంగళవారం ఉదయం నుంచి ఆ సంస్థ కార్యాలయాల మీద సోదాలు నిర్వహించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇకపోతే ఈ విషయమై GST అధికారులు కూడా ఎలాంటి ప్రకటన చేయకపోగా, UV క్రియేషన్స్ సంస్థ మాత్రం ఇలాంటి తనిఖీలు సర్వసాధారణం అన్నట్టు వ్యవహరించింది. ఇకపోతే UV క్రియేషన్స్ సంస్థను హీరో ప్రభాస్ వరుసకు సోదరుడైన ప్రమోద్ ఉప్పలపాటి ఆయన స్నేహితులు వంశీకృష్ణారెడ్డి, విక్రమ్ కృష్ణారెడ్డితో కలిసి ముంబై బేస్ తో 2013వ సంవత్సరంలో స్టార్ట్ చేసారు. ఈ సినిమా నుంచి మొదటి సినిమాగా ప్రభాస్ హీరోగా మిర్చి అనే సినిమా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ప్రభాస్ కు సన్నిహితంగా ఉన్న వారితోనే వీరు ఎక్కువ సినిమాలు చేస్తూ వచ్చారు.

ఓ రకంగా చెప్పుకోవాలంటే ఇది మన బాహుబలి ఫామిలీ ప్రొడక్షన్ హౌస్. ఈ నిర్మాణ సంస్థ శర్వానంద్ హీరోగా ఎక్స్ప్రెస్ రాజా, రన్ రాజా రన్, మహానుభావుడు నిర్మించింది. అలాగే నాని హీరోగా ‘భలే భలే మగాడివోయ్’, గోపీచంద్ హీరోగా జిల్, పక్కా కమర్షియల్ నిర్మించింది. ఆ తరువాత సంతోష్ శోభన్ హీరోగా ఏక్ మినీ కథ, విజయ్ దేవరకొండ హీరోగా టాక్సీవాలా, ప్రభాస్ హీరోగా రాధేశ్యామ్, సాహో వంటి భారీ సినిమాలు నిర్మించడం జరిగింది. తాజాగా ‘ఆది పురుష్’ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.