మరలా లవర్ బాయ్ అవతారమెత్తుతున్న రౌడీ హీరో… దేవరకొండపై మనసు పడ్డ బ్యూటీ!

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి అందరికీ తెలిసిందే. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తెలుగు చిత్రసీమలో ఎదుగుతున్న నటులలో విజయ్ ఒకరు. మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన విజయ్ అనతికాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో విజయ్ ఏకంగా స్టార్ హీరో రేంజ్ స్టేటస్ సొంతం చేసుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత గీత గోవిందం సినిమాలో నటించి లవర్ బాయ్ గా కూడా క్రేజ్ కొట్టేసాడు విజయ్ దేవరకొండ.

ఇక ఇటీవల విడుదలైన లైగర్ సినిమాతో భారీ పతనాన్ని చవిచూసిన విజయ్ నెక్స్ట్ రాబోయే సినిమాల విషయంలో ఆచితూచి అడుగు వేస్తున్నాడు. విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి తెలుగునాట ప్రత్యేకించి మాట్లాడుకోవలసిన పనిలేదు. విజయ్ ఫామ్ ఇపుడు మామ్మూలుగా లేదు. అటు బాలీవుడ్ హీరోయిన్స్, ఇటు టాలీవుడ్ హీరోయిన్స్ అతడిపై మనసు పారేసుకుంటున్నారంటే మీరే ఆలోచించండి. మొన్నటి వరకు సారా అలీఖాన్ తో పాటు మరికొంతమంది బాలీవుడ్ యంగ్ బ్యూటీలు విజయ్ దేవరకొండతో డేటింగ్ చెయ్యాలని భావిస్తే, ఇప్పుడు మరొక యంగ్ బ్యూటీ ఆయనపై మనసు పారేసుకుందని భోగట్టా.

అవును, నటి సోనాల్ మోంటెరోకి విజయ్ దేవరకొండ అంటే పిచ్చి అంట. ఇక ఈ విషయాన్ని బాహాటంగానే ఆమె ప్రకటిస్తోంది. ఈమె జయతీర్థ దర్శకత్వంలో తిలక్ రాజ్ బల్లాల్ నిర్మించిన చిత్రం బనారస్ సినిమాలో నటించింది. కాగా ఈ సినిమా తెలుగులో సతీష్ వర్మ విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో సోనాల్ మాట్లాడుతూ.. తెలుగు హీరోలలో విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమని, ఆయనతో ఒక సినిమాలో అయినా రొమాన్స్ చేయాలని తన మనుసులో మాటను చెప్పుకొచ్చింది.