యస్..ఆ డైరెక్టర్ నన్ను కొట్టారు..సంచలన విషయాలు బయటపెట్టిన యంగ్ హీరోయిన్..!!

ఫరీయా అబ్దుల్లా ..ఈ పేరుకు ప్రత్యేక పరచయాలు అవసరం లేదు. జాతి రత్నాలు అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది . అంతేనా ఆ తరువాత తనదైన స్టైల్ లో సినిమాల్లో గెస్ట్ రోల్స్ లో నటిస్తూ.. ఓ సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించి తన ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెంచుకునింది.

Jathi Ratnalu Telugu Movie | Clapnumber

కాగా ఆమె హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం “లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్”.. ఈ సినిమాకు మేకర్లపాక గాంధీ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు . మెగా డాటర్ నిహారిక నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 4న గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న ఫరీయా అబ్దుల్లా తన మొదటి సినిమా డైరెక్టర్ జాతి రత్నాలు డైరెక్టర్ నన్ను కొట్టారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఇవే కామెంట్స్ వైరల్ గా మారాయి.

Faria Abdullah: జాతిరత్నాలు షూటింగ్ సమయంలో హీరోయిన్‏ను డైరెక్టర్ కొట్టారా  ?.. క్లారిటీ ఇచ్చిన ఫరియా అబ్దుల్లా.. | TV9 Telugu

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెను హోస్ట్ ప్రశ్నిస్తూ ..”జాతి రత్నాలు సినిమా డైరెక్టర్ మిమ్మల్ని కొట్టారు అన్న న్యూస్ వైరల్ గా మారింది. అది నిజమేనా అని ప్రశ్నించగా.. ఆయన నన్ను కొట్టిన మాట వాస్తవమే ..కానీ అది కోపంగా కాదు సరదాగా ..మనకు తెలిసిందే అనుదీప్ చాలా జోవియల్ పర్సన్ ..సరదాగా ఉంటాడు ..నవ్వుతూ నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఆయన పక్కనే ఉన్న నన్ను సరదాగా కొట్టాడు . అంతే తప్పిస్తే అందులో వేరే అర్థం ఏమీ లేదు అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా అనుదీప్ ను ట్రోల్ చేస్తున్నారు జనాలు, అంతేకాదు సరదాగా అయినా సరే హీరోయిన్ పై చేయి చేసుకోవడం ఏంటి అంటూ ఆయన పై మండిపడుతున్నారు.