కాంతారా సినిమా నటీనటుల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసిన కేవలం ఒకే ఒక సినిమా గురించే మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ఆ చిత్రమే కాంతారా. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్స్ సునామీని సృష్టిస్తోంది. ముఖ్యంగా కన్నడలోనే అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన రిషబ్ శెట్టి ఎంతో అద్భుతమైన నటనని ప్రదర్శించడమే కాకుండా దర్శకత్వం కూడా అంతే అద్భుతంగా వ్యవహరించారు. ముందుగా ఈ సినిమా కన్నడ భాషలో విడుదలై అక్కడ మంచి విజయాన్ని అందుకోవడంతో గత నెల 15వ తేదీన తెలుగులో విడుదల చేశారు.

Kantara is the best thing to happen to me after PMT: Sapthami Gowda- The  New Indian Express
ఇక్కడ కూడా కాంతారా సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో కలెక్షన్ల సునామీ సృష్టించింది.మొదటిరోజు సూపర్ హిట్ టాక్ను సొంతం చేస్తుంది. ఈ సినిమా దాదాపుగా 16 కోట్ల రూపాయల ఖర్చుతో తెరకెక్కించగా ఇప్పటికే రూ.250 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కన్నడ సాంప్రదాయమైన భూతకోల ఆచారం నేపథ్యంలో తెరకెక్కించిన కాంతారా చిత్రం ఎంతోమంది ఆసక్తికరంగా చూసేలా చేసింది. రోజు రోజుకి ఈ సినిమా క్రేజ్ అమాంతం పెరుగుతూ ఉండడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా బాగానే రాబడుతోందని చెప్పవచ్చు.

Kantara witnesses blockbuster footfalls in theatres- The New Indian Express
ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టి వన్ మ్యాన్ షో గా ఎంతో అద్భుతంగా నటించారని చెప్పవచ్చు.ఈ సినిమాకు రిషబ్ శెట్టి రూ.4 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ సప్తమి గౌడ కూడా రూ.1.25 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించిన కిషోర్ పోలీస్ పాత్రలో నటించినందుకు కోటి రూపాయలు రెమ్యూనికేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ నటించిన అచ్యుత్ కుమార్ కూడా రూ. 75 లక్షలు తీసుకున్నారట. ప్రస్తుతం ఈ నటుల పారితోషకం వైరల్ గా మారుతోంది.