వైర‌ల్ వీడియో: `య‌శోద‌` కోసం స‌మంత సాహ‌సాలు.. గ‌ట్టిగానే క‌ష్ట‌ప‌డింది!

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గత కొన్ని రోజుల నుండి మయోసిటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని బయటపెట్టి అందర్నీ షాక్ కి గురిచేసింది. దీంతో సినిమా ఇండస్ట్రీ వారు మరియు సమంత అభిమానులు అందరూ సామ్ త్వరలో కోలుకోవాలని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సమంత సినీకెరీలో ఫస్ట్ టైం పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా `యశోద`. ఈ సినిమాకు హరి-హరీష్ దర్శకత్వం వహించగా శ్రీదేవి మూవీస్ పతాకం పై శివలెంక‌ కృష్ణ ప్రసాద్ నిర్మించారు.

తాజాగా రిలీజ్ అయిన `యశోద` థియేట్రికల్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ చూసిన వారంతా సమంత యాక్టింగ్ కి పాన్ ఇండియా లెవెల్ లో ప్రశంసలు అందుకుంటుందని మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి యాక్షన్ థ్రిల్స్ అనే పేరుతో మేకింగ్ వీడియో షేర్ చేశారు. సమంత ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం ఎంత కష్టపడిందనేది వివరంగా ఈ వీడియోలో చూపించారు.

ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్, మల్టీ టాలెంటెడ్ పర్సన్ యానిక్ బెన్ `యశోద` సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ కంపోజిషన్ వాటి కోసం సమంతకు ఎలా ట్రైనింగ్ ఇచ్చారు.. బెటర్ ఔట్పుట్ కోసం సమంత ఎలా కష్టపడిందో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నేటిజన్లు `యశోద` కోసం సమంత చేసిన సాహసాల గురించి సమంత చాలా గట్టిగానే కష్టపడిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. యశోద సినిమా నవంబర్ 11న ఓల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ప్రేక్షకులు ను అలరించనున్నది. సమంత మెయిన్ లీడ్ గా ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా చేస్తుండడంతో అభిమానులు `యశోద` సినిమా కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.