టాలీవుడ్ లోనే ఎక్కువ రోజులు.. ఆడిన టాప్ 10 సినిమాలు ఇవే..!

ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా మూడు రోజుల ఆడటం అంటే చాలా పెద్ద విషయమే.. అలాంటిది సినిమా 100 రోజుల పైన ఆడటం అంటే ఎంతో కష్టమైనే చెప్పాలి.. కానీ మన తెలుగు లో 50 రోజులు 100 రోజులు 150 రోజులు 1000 రోజులకి పైగా ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి.. ప్రస్తుత ఓటీటీ కాలంలో సినిమాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది.. ఇప్పుడు సినిమా టికెట్ల రేట్లు పెరగటం వల్ల ఇన్ని కోట్ల కలెక్షన్ రాబ‌ట్టింద‌ని చెప్తున్నారు కానీ… మన పాత రోజుల్లో సినిమా రికార్డులను సినిమాలు అడిన‌ థియేటర్లను బట్టి లెక్కలు వేసేవాళ్ళు… దాన్నిబట్టి ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అని చెప్పేవాళ్ళు.. మన తెలుగు చిత్ర పరిశ్రమలో 175 రోజులు కంటే ఎక్కువ థియేటర్లలో ప్రదర్శించిన సినిమాలు ఉన్నయి.. అలా థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడిన టాప్ 10 సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Watch Simhadri on ott streaming online

సింహాద్రి:
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సినిమా సింహాద్రి. ఈ సినిమా 2003లో విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఆ రోజుల్లో 175 సెంటర్లో వంద రోజులకు పైగా ఆడి… 52 సెంటర్లో 175 రోజులను పూర్తి చేసుకుని.. ఎన్టీఆర్ కెరియర్ లోనే ఆల్ టైం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

Pokiri - Disney+ Hotstar

పోకిరి:
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమా పోకిరి.. ఈ సినిమా మహేష్ కెరియర్ లోనే ఆల్ టైం సూపర్ హిట్ నిలిచింది. ఈ సినిమా ఏకంగా 200 సెంటర్లో 100 రోజులు ఆడింది.. 48 సెంటర్లో 175 రోజులకు పైగా ఆడి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

Watch Indra on ott streaming online

ఇంద్ర:
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బి. గోపాల్ డైరెక్షన్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమా ఇంద్ర.. ఈ సినిమా 2002లో విడుదలై చిరంజీవికి అదిరిపోయే హిట్ ఇచ్చింది.. ఈ సినిమా ఆ రోజుల్లో ఏకంగా 122 సెంటర్లో 100 రోజులు పూర్తి చేసుకోవడమే కాకుండా… 31 కేంద్రాల్లో 175 రోజులకు పైగా ఆడి.. చిరంజీవి కెరియర్ లోనే ఆల్ టైం హిట్‌గా నిలిచింది.

Secret Behind Balayya Blockbuster Title | cinejosh.com

సమరసింహారెడ్డి:
నందమూరి బాలకృష్ణ హీరోగా బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ సినిమా సమరసింహారెడ్డి… ఈ సినిమా 1999లోవిడుదలై బాలకృష్ణకు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.. ఈ సినిమా ఏకంగా ఆ టైంలో 29 కేంద్రాల్లో 175 రోజులకు పైగా ఆడింది.

Watch Pelli Sandadi on ott streaming online

పెళ్లి సందడి:
దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వచ్చిన సినిమా పెళ్లి సందడి.. ఎలాంటి అంచనాలు లేకుండా 1996లో విడుదలైన ఈ సినిమా శ్రీకాంత్ కు ఆల్ టైం హిట్ సినిమాగా నిలిచింది.. ఈ సినిమా ఆ రోజుల్లో ఏకంగా 27 థియేటర్లలో 175 రోజులకు పైగా ఆడింది.

నువ్వే కావాలి సినిమా చేసేందుకు రామోజీరావు పెట్టిన కండీషన్ ఏంటో తెలుసా

నువ్వే కావాలి:
తరుణ్ హీరోగా విజయభాస్కర్ డైరెక్షన్లో వచ్చిన సినిమా నువ్వే కావాలి..సినిమా 2000వ‌ సంవత్సరంలో విడుదలై తరుణ్ కు అదిరిపోయే హిట్ నచ్చింది.. ఈ సినిమా ఆ టైంలోనే 20 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా 25 సెంటర్లో 175 రోజులు ఆడి ఆల్ టైం రికార్డ్ గా నిలిచింది.

Premabhishekam Full Length Telugu Movie || A.N.R, Sridevi, Jayasudha ||  Ganesh Videos - DVD Rip.. - YouTube

ప్రేమాభిషేకం:
అక్కినేని నాగేశ్వరరావు హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా ప్రేమాభిషేకం.. 1981లో విడుదలైన ఈ సినిమా ఆ రోజుల్లోనే 19 కేంద్రాల్లో రజితోత్సవం జరుపుకుంది.

Narasimha Naidu(నరసింహ నాయుడు) Telugu Full Movie | Balakrishna, Simran,  Preeti Jhangiani - YouTube

నరసింహనాయుడు:
బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన మరో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ నరసింహనాయుడు.. 2001లో విడుదలైన ఈ సినిమా 17 థియేటర్లలో 175 రోజులకు పైగా ఆడి బాలకృష్ణకు మరో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

Kalisundam Raa Movie Full HD || Venkatesh || Simran || Srihari || Viswanath  || Suresh Productions - YouTube

కలిసుందాం రా:
విక్టరీ వెంకటేష్ హీరోగా ఉదయ్ శంకర్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన సినిమా కలిసుందాం రా…2000 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా వెంకటేష్ కెరియర్ లోనే అదిరిపోయే హిట్ సినిమాగా నిలిచింది.. ఈ సినిమా 14 సెంటర్లో 175 రోజులు ఆడింది.

Revisiting the celluloid Sita, Anjali Devi

లవకుశ:
సీనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సినిమా లవకుశ.. 1963 లో మొదటి కలర్ సినిమాగా వచ్చిన లవకుశ ఆ రోజుల్లోనే కోటి రూపాయలకు పైగా కలెక్షన్లను రాబట్టింది.. 13 సెంటర్లో 175 రోజులకు పైగా ఆడి.. ఎన్టీఆర్ రికార్డులను ఎన్టీఆర్ తిరగరాసుకున్నాడు.

Share post:

Latest