పుష్ప -2 సినిమాతో ఒరిగేది ఏమీ లేదా..?

డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్ల పరంగా భారీగానే వసూలు చేసింది. ఇక విడుదలైన ప్రతి చోట కూడా ఈ సినిమా అత్యధిక కలెక్షన్లను రాబట్టింది. అయితే ఇప్పుడు తాజాగా పుష్ప -2 సినిమాని తెరకెక్కిస్తున్నారు సుకుమార్ దీంతో ఈ సినిమా బడ్జెట్ హద్దులు దాటుతున్నాయని వార్తలు ఇండస్ట్రీలో చాలా వినిపిస్తున్నాయి. ఇక ఇందులో నటించే ప్రతి ఒక్కరు కూడా భారీ స్థాయిలో రెమ్యూనికేషన్ తీసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Exclusive: Allu Arjun's remuneration for Pushpa 2
పుష్ప-2 చిత్రాన్ని రూ. 300 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. అయితే ఈ సినిమా బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప మొదటి సినిమా భాగం హక్కులను తక్కువ మొత్తానికే విక్రయించడంతో నిర్మాతలకు ఎక్కువ లాభాలు వచ్చాయని చెప్పవచ్చు. ఇక పుష్ప -2 సినిమా షూటింగ్ ముందే బడ్జెట్లో కూడా శృతిమించుతున్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి మైత్రి మూవీ మేకర్ నిర్మాతలు ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఎలాంటి నిబంధనలు కూడా పెట్టుకోలేదని టాక్ వినిపిస్తోంది.

Allu Arjun's 'Pushpa 2' goes on floors | Mint
అందుచేతనే బాలీవుడ్ ప్రముఖ ప్రోటోగ్రాఫర్ ను ఈ సినిమాకి వర్కు చేయడం కోసం పిలిచారు. దీంతో పుష్ప-2 వచ్చేయేడాది డిసెంబర్ కి విడుదల చేసే విధంగా సలహాలు చేస్తున్నారు చిత్ర బృందం. ఇక పుష్ప -2 చిత్రానికి పనిచేస్తున్న టెక్నీషియన్లు సైతం ఊహించని స్థాయిలో క్రేజీ ఉన్నవాళ్లు కావడంతో ఈ సినిమా బడ్జెట్ కూడా అంతకంతకు పెరిగిపోయే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా ఇండస్ట్రీ హిట్టుగా నిలిచిన నిర్మాతలకు పెద్దగా ఒరిగేదేమీ లేదని పలువురు సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయంపై మైత్రి నిర్మాతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.