చచ్చిన ఆ హీరోతో నటించను… ముఖం మీదే చెప్పేసిన శ్రీదేవి..!?

ఒక్కో చిత్ర పరిశ్రమలో ఒక్కో స్టార్ హీరో ఉంటారు… అలా మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ ఒక లెజెండ్ అనే చెప్పాలి.. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఎన్టీఆర్ సినిమాలపై ఉన్న ఆస్తితో ఎంతో కష్టపడి తెలుగు చిత్ర పరిశ్రమలోనే స్టార్ హీరోగా ఎదిగారు.. ఆయన కెరియర్ లో ఎన్నో బ్లాక్‌ బాస్టర్ సినిమాలలో నటించి.. తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది అభిమానులను ఆయన సొంతం చేసుకున్నారు. ఆయన స్టార్ హీరోగా ఉన్న సమయంలో ఆయనతో నటించడానికి హీరోయిన్లు ఆయన వెనకాల పడేవారట.. ఆ సమయంలోనే శ్రీదేవి మాత్రం వేటగాడు సినిమాలో ఎన్టీఆర్ పక్కన హీరోయిన్గా నటించడానికిి ఒప్పుకోలేదట.. చచ్చినా కానీ ఆ సినిమాలో నటించనని డైరెక్టర్ ముఖం మీద చెప్పేసిందట శ్రీదేవి. ఆమె హీరోయిన్గా చేయ‌న‌ని చెప్పడానికి కారణం ఏంటి…? ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్ తో కలిసి ఆ సినిమాలో ఎందుకు నటించింది..? వాటికి సంబంధించిన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

NTR- Sridevi: శ్రీదేవి జీవితంలో ఎన్టీఆర్ చెప్పిందే జరిగింది.. ఇంతకీ ఏమిటో  తెలుసా అది ? - OK Telugu

దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వేటగాడు సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే.. ఈ సినిమా కథ ఎన్టీఆర్‌కు చెప్పే సందర్భంలో హీరోయిన్ల గురించి వాళ్ళిద్దరి మధ్య చర్చ కూడా వచ్చింది.. అప్పుడు ఎన్టీఆర్ ఈ సినిమాలు శ్రీదేవి బాగుంటుందని శ్రీదేవిని హీరోయిన్గా తీసుకోవాలని ఆయన చెప్పాడట. కానీ ఈ సినిమాకు నిర్మాతలుగా ఉన్నవారికి ఎన్టీఆర్ కు జోడిగా శ్రీదేవిని వద్దని చెప్పారట.. దీనికి ప్రధాన కారణం.. వేటగాడు సినిమా కంటే ఐదేళ్ల ముందు బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్‌కు మనవరాలుగా శ్రీదేవి నటించారు.. అప్పుడు మనవరాలుగా నటించిన శ్రీదేవి మళ్లీ ఎన్టీఆర్‌కు హీరోయిన్గా నటిస్తే ప్రేక్షకులు వేరే విధంగా అర్థం చేసుకుంటారేమో అని నిర్మాతలు కొంత భయపడ్డారట.. అయితే ఎన్టీఆర్ మాత్రం వేటగాడు సినిమాలో తన పక్కన శ్రీదేవిని హీరోయిన్గా నటించాలని పట్టుబట్టారట.

Vetagadu ( వేటగాడు సినిమా) Full Length Telugu Movie || NTR, Sridevi ||  Telugu Hit Movies - YouTube

అప్పుడు రాఘవేందర్రావు శ్రీదేవితో సంప్ర‌దింపులు చేయడం మొదలుపెట్టారు.. ఎన్టీఆర్ సినిమాలో మనవరాలుగా చేసిన ఆమె ఎన్టీఆర్ పక్కన హీరోయిన్గా చేయడానికి భయపడింది. అందుకే ఆయన పక్కన నేను చచ్చినా చేయను అంటే చేయను అంటూ మొండిగా భీష్మించుకుని కూర్చుంది….. తర్వాత ఎన్టీఆర్ శ్రీదేవితో సంప్రదింపులు చేయగా శ్రీదేవికి నచ్చచెప్పి హీరోయిన్ గా ఒప్పించారని తెలుస్తుంది.. ఎన్టీఆర్ శ్రీదేవితో సినిమాలో కథని కథనాన్ని మాత్రమే ప్రేక్షకులు చూస్తారు.. హీరో హీరోయిన్లు వయసును వాళ్లు పట్టించుకోరు.. సినిమా కథ బాగుంటే ప్రేక్షకులు ఎలా ఉన్నా చూస్తారు.. అని ఎన్టీఆర్ శ్రీదేవితో చెప్పడంతో శ్రీదేవి వేటగాడు సినిమాలో నటించడానికి ఒప్పుకుంది… తర్వాత ఈ సినిమా విడుదలై ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో మనందరికి తెలిసిందే.. తర్వాత వీళ్ళిద్దరి కాంబోలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు కూడా వచ్చాయి.