తాజాగా గరికపాటిపై సెటైర్ వేసిన బ్రహ్మానందం..: ఎక్కడంటే?

ఈమధ్య గరికపాటి నరసింహారావు పేరు బాగానే వినబడుతోంది. దానికి కారణం మీకు తెలిసిందే. చిరు వివాదం తరువాత గరికపాటి వారి పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ క్రమంలో కొందరు పెద్దలు కలగజేసుకొని ఈ ఇష్యూని పెద్దది కాకుండా కంట్రోల్ చేయడం జరిగింది. కాకపోతే, అప్పటి నుంచి గరికపాటి గారు ఎక్కడికి ఉపన్యసించడానికి వెళ్లినా ఆ ప్రదేశం కాస్త ఉత్కంఠగా మారుతుంది. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ తెలుగు హాస్య నటుడు బ్రహ్మానందం గరికపాటిపై సైలెంటుగా ఓ సంచలన కామెంట్ చేశాడు. దాంతో ఈ వార్త వైరల్ అవుతోంది.

ఈ క్రమంలో మామ్మూలుగానే మాట్లాడుతూ వేయకూడని సెటైర్లు వేసి ఒకింత ఆశ్చర్యానికి గురయ్యేలా చేసాడు. దాదాపు 3 దశబ్దాలకు పైగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్రహ్మానందం అన్నివర్గాల ప్రేక్షకులను తన హాస్యంతో ఉర్రుతలూగించారు. ప్రస్తుతం అవకాశాల్లేక ఖాళీగా ఉంటున్నసమయంలో కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతూ తనదైన శైలిలో ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఆయన కేవలం హస్య నటుడే కాకుండా కవి అన్న విషయం చాలా మందికి తెలియదు. దాంతో ఏ కార్యక్రమానికి వెళ్లినా ఎక్కువ టైం తీసుకోకుండా నాలుగు మాటలు చెప్పి వీనులవిందు చేస్తున్నాడు.

కాగా తాజగా గరికపాటి నరసింహారావు గురించి మాట్లాడుతూ… “కొందరు నా గురించి ఏదో ఎక్కువ చేసి గరికపాటితో పోలుస్తున్నారు.. నేనేదో సినిమాల్లో 4 వేషాలు వేసుకునే సాధారణమైన నటుడిని. అలాంటి నన్ను ఆధ్యాత్మిక భావాలను వడబోసిన గరికపాటితో పోల్చడం ఒకింత విడ్డురమే.” అని అన్నారు. అలాగే “ఆధ్యాత్మిక వచనాలకు ప్యాంట్ షర్ట్ వేస్తే.. గరికపాటి అనుకోవచ్చు” అని కూడా ఈ సందర్భంగా అన్నారు. ఇకపోతే ఈ మాటలే ఇపుడు వైరల్ అవుతున్నాయి. మెగాభిమానులు ఈ వ్యాఖ్యలు చూసి బ్రహ్మానందం సైలెంటుగా వేసాడుగా అంటూ సంబరపడిపోతున్నారు.