ఆ హీరో మాత్రమే కష్టపడి పైకి వచ్చారంటూ బాంబు పేల్చిన శ్రీరెడ్డి.!!

రెండు తెలుగు రాష్ట్రాలలో శ్రీ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన పెను సంచలనంగా మారుతూ ఉంటాయి. ఇక శ్రీరెడ్డి ఎప్పుడూ కూడా కొంతమంది మీద నెగిటివ్  కామెంట్స్ చేసిన ఆమె మీద మాత్రం చాలా మందికి సదాభిప్రాయం ఉండనే ఉంటుంది. అయితే మెగా ఫ్యామిలీ గురించి ఇతర విషయాల గురించి శ్రీరెడ్డి మాట్లాడుతూ ఎప్పుడూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తూ ఉంటుంది. మొదట మెగా ఫ్యామిలీ తనను తొక్కేయడానికి ప్రయత్నించిందని తెలియజేసింది శ్రీరెడ్డి. ఇక అప్పటినుంచి శ్రీ రెడ్డి ఎలాంటి విషయంలోనైనా సరే ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటుంది.

Sri Reddy Slams Allu Arjun For Celebrating His Birthday Amid Coronavirus  Lockdown - Filmibeat
అయితే గత కొద్ది రోజుల నుంచి ఎక్కువగా పవన్ కళ్యాణ్ విరుచుకుపడి మాట్లాడుతూ ఉండడంతో వాటన్నిటికీ కౌంటర్లు ఇస్తూ ఉంది శ్రీరెడ్డి. కేవలం మెగా కుటుంబంలో అల్లు అర్జున్ మాత్రమే తన ప్రతిభతో నటన తో పైకి ఎదిగారని మిగిలిన వారంతా పండిపోయిన పండ్ల లా రాలిపోతున్నారని శ్రీరెడ్డి కామెంట్లు చేయడం జరుగుతోంది. ఇక మెగా కుటుంబంలో ఆడపిల్లల జీవితాలు ఏ విధంగా ఉన్నాయో అందరికీ తెలిసిందే అంటూ తెలియజేస్తోంది. ప్రస్తుతం మెగా ఫ్యామిలీని ఎవరు పట్టించుకోవడంలేదని సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది బతుకుతున్నారని శ్రీ రెడ్డి తెలియజేస్తోంది.

ఇక తన మీద ఎన్నో కేసులు పెట్టి బిగ్ బాస్ హౌస్ వంటి వాటిలోకి కూడా రానీయకుండా అడ్డుకున్నారని తెలిపింది.అందుచేతనే యూట్యూబ్ ఛానల్ ద్వారా పలు వీడియోలను తెలియజేస్తూ లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉంటానని తెలియజేస్తోంది శ్రీరెడ్డి.మెగా కుటుంబం ప్రతిభ ఉన్నప్పటికీ ఎంతోమందికి అవకాశాలు రాకుండా చేస్తున్నారని తెలియజేస్తోంది. ఇలా ఎంతోమందిని ఇబ్బంది పెట్టిన వాళ్లను కర్మ అనేది వదిలిపెట్టరని తెలియజేస్తోంది ప్రస్తుతం శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.