విడుదలకు ముందే లాభాల బాట పట్టిన ‘యశోద’.. సమంతా మజాకా?!

సమంత లేడీ ఓరియంటెడ్ కథాంశం తో తెరకెక్కుతున్న సినిమా `యశోద`. ఈ సినిమాకి హరి శంకర్ మరియు హరీష్ నారాయణ్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ పతాకం పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, సంపత్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు. గత ఏడాది ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని నవంబర్ 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్టు అధికారకంగా ప్రకటన చేశారు.

సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడంతో ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అప్పుడే “యశోద“ సినిమా లాభాల్లోకి వచ్చినట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు చక్కర్ల కొడుతున్నాయి. ఇప్పటికే సమంత `యశోద` సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ తో సరికొత్త బజ్ ను క్రియేట్ చేసింది. సినిమా రిలీజ్ కాకముందే ప్రొడ్యూసర్లకు ఏకంగా 8 కోట్ల రూపాయలు లాభం వచ్చిందని సినీ ఇండస్ట్రీ నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ వార్త విన్న సమంత అభిమానులు విడుదలకముందే లాభాలు బాట పట్టిన సినిమా.. సమంతా నా మజాకా ? అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమాలో సమంత గర్భిణిగా మరియు సైకలాజికల్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమాపై అభిమానుల్లో సర్వత్ర ఆసక్తి నెలకొన్నది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో నవంబర్ 11 వరకు ఎదురు చూడాల్సిందే.

Share post:

Latest