స‌మంత‌ను వేధిస్తున్న `మైయోసిటిస్` ల‌క్ష‌ణాలు ఇవే.. ఈ వ్యాధి ఎందుకు వ‌స్తుందో తెలుసా?

సమంత.. వరుస సినిమాలలో హీరోయిన్గా నటిస్తూ మంచి స్టార్ డమ్ ను దక్కించుకుని స్టార్ హీరోయిన్గా మారింది. అక్కినేని నాగచైతన్య తో విడాకులు తీసుకుని ఏడాది పైగా కావస్తుంది. ఇక అప్పటినుంచి ఆమె తరచూ వార్తల్లో నిలుస్తుంది. అంతేకాకుండా సమంత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతుందని సోషల్ మీడియాలో తరచూ వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై ఎప్పుడు స్పందించని సమంత తాజాగా ఆమె అనారోగ్యంతో ఉన్నట్లుగా తెలిపింది.

ఇదిలా ఉంటే సమంత తాను `మైయోసిటిస్` తో బాధపడుతున్నట్లు తన‌ ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక పోస్టు పెట్టి అధికారికంగా ప్రకటించింది. ఓ పక్క చేతికి సెలైన్ తో మరోపక్క డబ్బింగ్ చెబుతున్న సమయంలో తీసిన ఓ ఫోటోను షేర్ చేసింది సమంత. అయితే సమంతను వేధిస్తున్న `మైయోసిటిస్` లక్షణాలు అలాగే ఈ వ్యాధి ఎందుకు వస్తుందో మనం తెలుసుకుందాం..

మయోపతి అంటే కండరాల వైకల్యం అని అర్థం. ఇది కండరాలకు సంబంధించిన సమస్య. అయితే కండరాలలో నిరంతర బలహీనత కారణంగా వారి సామర్థ్యం పై ప్రభావం పడి కూర్చోవడం, లేవడం, నడవడం చాలా కష్టంగా మారుతుంది. అయితే ఈ సమస్య సహజంగా 40 నుంచి 60 సంవత్సరాలు దాటిన మహిళలు మరియు పిల్లల్లో కనిపిస్తుంది. అయితే సమంతకు వచ్చిన `మైయోసిటిస్` అత్యంత అరుదైనదని సమాచారం. ఈ వ్యాధి బారిన పడినవారికి ఆరోగ్యపరంగా అనేక సమస్యలు ఎదురవ్వడంతో పాటు నిలుచున్నేందుకు కూడా వారికి శక్తి ఉండదు. పైగా రోగ నిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతూ కండరాలన్నీ బలహీనంగా మారుతాయి.

నొప్పులు కూడా విపరీతంగా ఉంటాయని సమాచారం. ముఖ్యంగా ఇందులో కండరాలే కాకుండా చర్మం, ఊపిరితిత్తుల్లో మంట కూడా వస్తుంది. అయితే `మైయోసిటిస్` అంటే కండరాలలో మంట, నొప్పి, వాపు అని అర్థం. ఇక ఈ సమస్యలో కండరాలు వారాలు మరియు నెలలలో క్రమంగా బలహీన పడుతూ ఉంటాయి. కొన్నిసార్లు నొప్పి అనిపించకపోవడం వలన అది అసలు మనకు తెలియదు. కూర్చున్న తర్వాత లేవడంతో మద్దతు అవసరమైతే కండరాలు బలహీన పడటం ప్రారంభించాయని మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే ఈ వ్యాధిని రక్త పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు. ప్రస్తుతం ఈ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స లేకపోవడంతో క్రమం తప్పకుండా కండరాల వ్యాయామాలు మరియు విటమిన్లు ఇవ్వడం ద్వారా పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుందని చెబుతున్నారు. ఇక ప్రస్తుతం సమంత కూడా ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతుందని సమాచారం.