నాభి సోగ‌సుల‌తో కృతి శెట్టి అరాచ‌కం.. ఏం ఉందిరా బాబు!

కృతి శెట్టి.. `ఉప్పెన` సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి మంచి విజయాన్ని అందుకొని కుర్ర కారు కలల రాకుమారిగా ఈ బ్యూటీ మారిపోయింది. డెబ్యూ సినిమాతోనే కృతి శెట్టి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని సినిమా పరిశ్రమంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. `ఉప్పెన` సూపర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత వరుస సినిమాలలో ఆఫర్లు కొట్టేసింది.

శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. అయితే వీటిలో `బంగార్రాజు` మాత్రమే హిట్ అయింది.. మిగతా సినిమాలన్నీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. తాజాగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా సైతం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడిందని చెప్పాలి.

అయితే కృతి శెట్టి తెలుగులో వరుస సినిమాలు చేసినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మంచి కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తోంది. తాజాగా కృతి శెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో ఆమె ట్రెడిషనల్ డ్రెస్సులో దర్శనమిచ్చింది.

బ్లూ కలర్ డ్రెస్ లో కిర్రాక్ ఫోజులిస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. కొంటె చూపులతో కవ్విస్తూ కుర్ర కారు మతులు పోగొడుతుంది ఈ ముద్ద గుమ్మా. ఇక కృతి శెట్టి వరుసగా ఫోటో షూట్ లు చేస్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూ ఉంటుంది.