బండ్ల గణేష్ తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వారంటూ ఎవరు ఉండరు. ముఖ్యంగా నటుడుగా, నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ ఈమధ్య రాజకీయాలలో కూడా చాలా చురుకుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న బండ్ల గణేష్.. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీ యంట్రి ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉండగా సోషల్ మీడియాలో బండ్ల గణేష్ చాలా యాక్టివ్ గా ఉంటారని చెప్పవచ్చు.
ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా బండ్ల గణేష్ చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని ప్రకటిస్తున్నట్లుగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. బండ్ల గణేష్ తన ట్విట్టర్ నుంచి ఈ విధంగా రాసుకొస్తూ.. నమస్కారం నా కుటుంబ బాధ్యతల వల్ల నా ఉమ్మడి సభ్యుల నేపథ్యంలో వారి కోరికపై మా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ తనకున్న పనుల వల్ల వ్యాపారాల వల్ల తను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలియజేశారు.
అంతేకాకుండా తనకు ఏ రాజకీయ పార్టీతో కానీ వ్యక్తులతో కానీ శత్రుత్వం లేదని.. మిత్రుత్వం గానీ లేదని తెలియజేశారు. అందరూ కూడా తనకు ఆత్మీయులే అని తెలిపారు. ఇంతకుముందు తన వల్ల ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇబ్బంది పడి ఉంటే తనను పెద్దమనిషితో క్షమించమని కోరుతూ బండ్ల గణేష్ ఒక ట్వీట్ చేశారు ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారుతోంది.
నమస్కారం.. నా కుటుంబ బాధ్యతల వల్ల నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో.. వారి కోరికపై మా పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ నాకున్న పనులు వల్ల వ్యాపారాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ లేదు….2
— BANDLA GANESH. (@ganeshbandla) October 29, 2022
…..అందరూ నాకు ఆత్మీయలే.. అందరూ నాకు సమానులే.. ఇంతకుముందు నావల్ల ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా బాధపడి ఉంటే నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తూ మీ బండ్ల గణేష్..🙏
— BANDLA GANESH. (@ganeshbandla) October 29, 2022