సరోగసిపై షాకింగ్ కామెంట్స్ చేసిన జయమ్మ..!!

తెలుగు, తమిళ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు వరలక్ష్మి శరత్ కుమార్. ఇటీవలే తెలుగులో పలు సినిమాలలో నటిస్తూ బాగా సందడి చేస్తూ ఉంది. ముఖ్యంగా వరలక్ష్మి క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించింది . ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక మొదట హీరోయిన్ గా ఎన్నో చిత్రాలలో నటించినా అవి పెద్దగా కలిసి రాకపోవడంతో ఈమె విలన్ గా పలు పాత్రలలో నటిస్తూ ఉన్నది. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలో కూడా నటించింది.

Varalakshmi Sarathkumar | సమంతతో కలిసి పనిచేయడం గురించి వరలక్ష్మీ శరత్‌  కుమార్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ - Namasthe Telangana
అలాగే సమంత నటిస్తున్న యశోద సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నది.ఈ చిత్రాన్ని హరి-హరిష్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ చిత్రం వచ్చే నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది .ఈ సందర్భంగా వరలక్ష్మి శరత్ కుమార్ మీడియాతో ముచ్చటించడం జరిగింది. వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ ఇటువంటి క్యారెక్టర్ లను ఎలా రాశారు..? ఈ కథని ఎలా ఆలోచించారని ఆశ్చర్యపోతూ అడిగానని తెలియజేసింది.

మీరు ట్రైలర్ చూస్తే నా క్యారెక్టర్ చాలా కామ్ గా ఉంటుంది. కథ ముందుకు సాగేటప్పుడు క్యారెక్టర్ గురించి మరింత రిలీవ్ అవుతుంది.. గ్రే షేడ్స్ ఉన్న రోల్ చేశా.. సమంత క్యారెక్టర్ నా క్యారెక్టర్ మధ్య ఉన్న రిలేషన్స్ మా కథలు చాలా ఆసక్తిగా ఉంటాయని తెలిపింది. సమంతతోపాటు తన క్యారెక్టర్ కూడా ప్లే రోల్ గా ఉంటుందని తెలిపింది వరలక్ష్మి. ప్రతి చిత్రంలో కూడా మంచి చెడులు చూపించారు సరోగసి కాంప్లికేటెడ్ ఏమీ కాదు.. కొంతమంది యాక్టర్ సరోగసిని ఆశ్రయించడం వల్ల డిస్కషన్ జరుగుతున్నాయి.. పిల్లలు లేని చాలా మందికి సరోగసి ద్వారానే పొందే అవకాశం కలుగుతుంది .ఈ కథలో సరోగసి అనేది ఒక టాపిక్ మాత్రమే అందులో మంచి చెడుల గురించి చెప్పడం లేదు.. సమాజంలో ఇటువంటి మనుషులు కూడా ఉన్నారని చెప్పవచ్చని తెలియజేసింది వరలక్ష్మి.