రాహుల్ గాంధీతో చేతులు కలిపిన పూనమ్ కౌర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ పూనమ్ కార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఎంతోమంది హృదయాలను తన అందంతో చూపులతో బాగా ఆకట్టుకున్న పూనమ్ పెద్దగా సక్సెస్ కాలేకపోయిందని చెప్పవచ్చు. మాయాజాలం సినిమాతో మొదటిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది. సినిమాలలో అవకాశాలు లేక అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో నిత్యం టచ్ లోనే ఉంటుంది పూనమ్ కౌర్. అయితే తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు షేర్ చేస్తే ఎప్పుడు వివాదాలలో చిక్కుకుంటూ ఉంటుంది.

తెలంగాణలో రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రకు మద్దతు తెలిపిన సినీ నటి పూనమ్ కౌర్ వైరల్ అవుతున్న ఫోటోలు | film actress poonam kaur supporting rahul gandhi bharat jodo yatra ...

ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని తప్పు పడుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేస్తే చాలు అది ప్రేక్షకులలో వైరల్ గా మారుతూ ఉంటుంది. తాజాగా ఇప్పుడు అందరికీ సడన్ షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం ఇండియాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ లో జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. తాజాగా తెలంగాణలోకి జోడో పాదయాత్రతో ప్రవేశించారు. అయితే నిన్నటి రోజున ఉదయం రాహుల్ గాంధీ పాదయాత్ర మహబూబ్నగర్ జిల్లా ధర్మపురి లో ప్రారంభించారు. ఆ పాదయాత్రలో పూనమ్ కౌర్ కూడా కనిపించింది.

అలా రాహుల్ గాంధీతో పాటు తన కూడా పాదయాత్ర చేసింది. అయితే ఈమె ఉస్మానియా విద్యార్థులతో రాహుల్ ని కలిసి పాదయాత్రతో ముందుకు సాగుతూ సమయంలో ఆయనతో మాట్లాడుతున్న ఒక వీడియో చాలా వైరల్ గా మారింది. ఇక అంతే కాకుండా రాహుల్ గాంధీ పక్కన సడన్గా నడవడం ఏంటా అంటూ అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగానే ఈమె ఇలా మద్దతు పలుకుతుందేమో అని అనుమానిస్తున్నారు. నేటిజెన్లు ఇదేమి ట్విస్ట్ రా బాబు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.