ఈ హీరోస్ మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ ఏంటో తెలిస్తే.. షాక్ అయిపోతారు..!

చిన్నప్పటి నుంచి ఒకే క్లాసులో ఒకే స్కూల్లో కలిసి చదువుకున్న స్నేహితులు ఆ తర్వాత కూడా ఆ ఇద్దరూ ఒకే పనిచేస్తుంటే వారు ఇద్దరి మ‌ధ్య‌ వచ్చే సంభాషణలలో వారి చిన్నప్పుటి అనుభూతులు గుర్తు చేసుకుంటూ ఎంతో ఆనంద పడుతూ.. చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు.. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు కూడా ఒకే క్లాసులో చదువుకుని ఇప్పుడు చిత్ర పరిశ్రమంలో రాణిస్తున్నారని మీకు తెలుసా… అలా హీరోలుగా రాణిస్తున్న వారిలో కొందరు స్టార్ హీరోలు ఉన్నారు… వ్యాపారవేత్తలు ఉన్నారు.. అలా రాణిస్తున్న వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Ramcharan

రామ్ చరణ్- రానా: రామ్ చరణ్- రానా చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులున విష‌యం మ‌న‌కు తెలిసిందే .. వీళ్ళిద్దరూ కలిసి హైదరాబాదులో ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఈ విషయం గురించి రానా- రామ్ చరణ్ పలు ఇంటర్వ్యూలలోఓపెన్ గానే చెప్పేశారు. అంతేకాదు చాలా ఇంటర్వ్యూలలో వాళ్ళ చిన్నప్పటి విషయాలను అభిమానులతో పంచుకున్నారు. అంతే కాకుండా వారి మధ్య జరిగిన కొన్ని తీపి జ్ఞాపకాలను కూడా చెప్పారు… నాకు పంపిన టిఫిన్ బాక్స్ ని రానా ఖాళీ చేసే వాడిని కూడా రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. వీళ్ళిద్దరూ చిన్నప్పుడు ఒకే స్కూల్లో చదువుకుని ఇప్పుడు సినిమా రంగంలో స్టార్ హీరోలుగా ఉన్నారు.

Anushka Sharma skahsi

అనుష్క శర్మ- సాక్షి: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ టీమ్ ఇండియా స్టార్ట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ.. మరియు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని భార్య సాక్షి.. వీరిద్దరూ అస్సాంలో ఒకే క్లాసులో ఒకే స్కూల్లో కలిసి చదువుకున్న విషయం మీకు తెలుసా.. వీరిద్దరూ ఒకే రంగానికి చెందిన ఇద్దరు స్టార్ క్రికెటర్ ల‌ని పెళ్లి చేసుకుని వారి జీవితంలో హ్యాపీగా ఉన్నారు.

Nani pradeep

నాచురల్ స్టార్ నాని- స్టార్ యాంకర్ ప్రదీప్: హీరో నాని మరియు టీవీ యాంకర్ ప్రదీప్ మాచిరాజు కూడా చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు.. వీరిద్దరు కూడా చిన్నప్పుడు నుంచి ఒకే క్లాసుల్లో క‌లిసి చదువుకున్నారు.. అయితే వీరిద్దరూ ఓకే రంగంలో స్టార్ ప్లస్ లో కొనసాగుతున్నారు… నాని టాలీవుడ్ లో స్టార్ హీరోగా రానిస్తుండగా.. ప్రదీప్ బులితెరపై స్టార్ యాంకర్ గా కొనసాగుతున్నాడు.

Ameer khan Salman khan

సల్మాన్ ఖాన్ -అమీర్ ఖాన్: బాలీవుడ్ స్టార్ హీరోలైన‌ సల్మాన్ ఖాన్- అమీర్ ఖాన్ కూడా చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులట.. వీరిద్దరూ కూడా చిన్నప్పుడు ఒకే క్లాసులో ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు.. ఇప్పుడు బాలీవుడ్ లో వీరిద్దరూ స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు.

Mukesh ambani anand mahindra

వీరు మాత్రమే కాకుండా భారతదేశంలో దిగజ వ్యాపారవేత్తలుగా ఉన్న ముఖేష్ అంబానీ మరియు ఆనంద్ మహీంద్రా కూడా చిన్నప్పటినుంచి మంచి స్నేహితులు వీరిద్ద‌రూ కూడా ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు.. అయితే ప్రస్తుతం ఇద్దరూ వ్యాపార రంగంలో పోటీ పడుతూ దూసుకుపోతున్నారు.