మీకు తెలుసా? అనసూయ చెల్లెలు కూడా యాంకర్‌గా ట్రై చేస్తోంది!

యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. బేసిగ్గా బుల్లితెర షో అయినటువంటి ‘జబర్దస్త్’ ద్వారా పరిచయం అయిన ఈ అమ్మడు అనతికాలంలోనే స్టార్ యాంకర్ గా గుర్తింపు సంపాదించుకుంది. అక్కడితో ఆగకుండా సినిమాలలో కూడా తన సత్తాని చాటుతోంది. ఈమె అందానికి, స్టైల్ కి తెలుగు కుర్రకారు ఫిదా అయిపోతోంది. ఇప్పటికే ఆమెకి అభిమాన సంఘాలు తయారయ్యాయి. ఈ రకంగా ఓ తెలుగు యాంకర్ కి మొదటిసారి ఆదరణ లభిస్తోంది అనడంలో అతిశయోక్తి లేదు.

ఈ క్రమంలో ఆమె నెంబర్ వన్ హాటెస్ట్ యాంకర్ అని పేరు తెచ్చుకుంది. ఇకపోతే సక్సెస్ ఫుల్ స్థానంలో వున్న అక్కని చూసి, చెల్లెలకి కూడా కోరిక కలిగినట్టుంది. అన్నట్టు అనసూయకి ఇద్దరు చెల్లెళ్లు వున్న సంగతి తెలిసినదే. ఓ ఈవెంట్‌లో తన చెల్లెలు వైష్ణవిని ఈ ప్రపంచానికి పరిచయం చేసి, చెల్లెలు కూడా వస్తోంది… కాసుకోండి అన్నట్టు ప్రచారం చేసింది. ఇకపోతే వైష్ణవి, కాస్త అక్క అనసూయను పోలిన మాట వాస్తవమే కానీ, చలాకీతనంలోనూ, అందంలోనూ అక్కకు పోటీగా నిలుస్తుందా అనేది ఇపుడు పెద్ద ప్రశ్న.

మరి అనసూయక్క తోడుతో వైష్ణవి యాంకర్‌గా రాణిస్తుందేమో గాని, అనసూయ అభిమానులు మాత్రం ఆమెకి ఇప్పటికీ ఆహ్వానం పలికేస్తున్నారు. ఓ ఎంటర్‌టైన్ ఛానెల్‌‌లో ఓ రియాల్టీ షో కోసం ఆల్రెడీ వైష్ణవి పేరు
అనసూయ రికమెండ్ చేసినట్టు భోగట్టా. అక్కలాగా మంచి పేరు తెచ్చుకుంటుందో, లేక మెరుపుతీగ మాదిరి కనుమరుగవుతుందో చూడాలి మరి. ఇక పొతే మన అనసూయ అక్క ఓ వైపు టివి షోలలో కనబడుతూనే మరోవైపు సినిమాలతో మంచి బిజీగా గడుపుతోంది. ఈమధ్యన అన్న మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో కనబడి వీనులవిందు చేసిన సంగతి విదితమే.