సమంత యశోద కోసం ఐదుగురు హీరోలా..ఎవరు ఊహించని అప్డేట్..!

సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద సినిమా ట్రైలర్ లాంచ్ కోసం సినిమా యూనిట్ ఎవరు ఊహించని విధంగా ప్లాన్ చేస్తుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజ‌ర్ లో గర్భవతిగా కనిపించిన సమంత ..తన పర్ ఫామెన్స్ తో చించేసింది.దీంతో యశోద సినిమాపై భారి స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి.

Samantha Ruth Prabhu's 'Yashoda' trailer to be launched by Vijay Deverakonda, Suriya, Varun Dhawan and Dulquer Salmaan | Regional News | Zee News

ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం నాడు ఐదుగురు స్టార్‌ హీరోలు విడుదల చేయబోతున్నారు. దీంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంత బాలీవుడ్ లో ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో నటించి పాన్ ఇండియా హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సిరీస్ తర్వాత వచ్చిన పుష్ప సినిమాలో ఐటింగ్ సాంగ్ తో అదరగొట్టింది.

Yashoda' Trailer Release Date Announced by Pan-Indian Stars | klapboardpost Yashoda' Trailer Release Date Announced by Pan-Indian Stars

ఇక ఇప్పుడు యశోద సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో రాబోతుంది సమంత. ఈ సినిమాలో సమంత తో పాటు వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ వంటి కొందరు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను హరిహర్ష అనే నూతన దర్శకుడు తెరకెక్కించాడు. శివలంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. యశోద సినిమా ట్రైలర్ గురువారం నాడు( ఈనెల 27న‌) సాయంత్రం 5:36 కి ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు. తెలుగులో ఈ సినిమా టైలర్ విజయ్‌ దేవరకొండ,తమిళ్‌లో సూర్య, కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళం లో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ లో వరుణ్ ధావన్ ఈ ఐదుగురు స్టార్ హీరోలు ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారని యశోద చిత్ర యూనిట్ ప్రకటించింది.

Share post:

Latest