చిరంజీవి గాడ్ ఫాదర్ కలెక్షన్ డీటెయిల్స్… మరి ఇంత దారుణమా..!

చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా ప్రేక్షకులకు ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తొలి వారంలో ఈ సినిమా అంచనాలను మించి భారీ కలెక్షన్ లను రాబట్టుకుంది. అయితే వీకెండ్ లో ఈ సినిమాకు చెప్పుకోతగ్గ కలెక్షను రాలేదు. సినిమాకు అడ్వాన్సులు తీసుకున్న నిర్మాతలు రిలీజ్ చేసిన మార్కెట్ లెక్కల ప్రకారం 15 కోట్లలు నష్ట పోయారని తెలుస్తుంది.

గాడ్ ఫాదర్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చిన ఆ కలెక్షన్ లు చిరంజీవి స్థాయికి సరిపోవని కామెంట్లు వినిపిస్తున్నాయి. గాడ్‌ ఫాదర్ సినిమా ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకుల వారికి నచ్చే అంశాలు కూడా లేవు. అసలే ఈ సినిమాను మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కించారు. అప్పటికే లూసిఫర్ సినిమా చూసిన ప్రేక్షకులు గాడ్ ఫాదర్ సినిమాపై ఎక్కువ ఆసక్తి చూపించలేదు.

Kantara Collections beat Godfather Collections in Box Office | Kantara vs Godfather : ಬಾಕ್ಸಾಫೀಸ್‌ನಲ್ಲಿ ಕಾಂತಾರ vs ಗಾಡ್‌ಫಾದರ್! Entertainment News in Kannada

ఈ క్రమంలోనే గాడ్ ఫాదర్ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు దసరా సీజన్లో రిలీజ్ కావటం కూడా గాడ్ ఫాదర్ కలెక్షన్లపై ప్రభావం చూపింది. దేశం మొత్తం మెచ్చిన సినిమా కాంతారా ఈనెల 5వ తారీఖున తెలుగులో విడుదల అయింది. ఈ సినిమా విడుదలైన అప్పటినుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకోవడంతో గాడ్ ఫాదర్ కలెక్షన్లు తగ్గు ముఖం పట్టాయి. దీపావళి సెలవులు వచ్చినా కూడా గాడ్ ఫాదర్ కలెక్షన్ విషయంలో ఏం మాత్రం పెరగలేదు. ఇప్పటినుంచి గాడ్ ఫాదర్ కు నామ మాత్రపు కలెక్షన్లు కూడా వచ్చే అవకాశం కూడా లేదు. ఈ సినిమాతో చిరంజీవి ఆశించిన స్థాయి సక్సెస్ ను అందుకోలేకపోయాడు. తాజాగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాతో అయినా భారీ సక్సెస్‌ను అందుకుంటారు లేదో చూడాలి..!!