‘యస్, అతడితో ఆ రూమర్‌ నిజమే’..రష్మిక సంచలన ప్రకటన..!!

రష్మిక మందన్నా స్పీడ్ అని తెలుసు కానీ, మరీ ఇంత స్పీడ్ అని అనుకోలేదు అంటున్నారు జనాలు. ఇన్నాళ్లు వరుస సినిమా ఆఫర్లతో క్షణం కూడా తీరిక లేకుండా గడిపేస్తున్న ఈ కన్నడ బ్యూటీ రష్మిక..ఇప్పుడు యాడ్స్ తో కూడా కోట్లు సంపాదిస్తూ..నెట్టింట ట్రెండింగ్ గా మారింది. ఛలో సినిమా తో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి కాళ్లు మోపిన ఈ బ్యూటీ..ఆ తరువాత ఎక్కడ ఆగకుండా రైయ్..రైయ్..మంటూ దూసుకుపోతుంది.

ఇప్పటికే పుష్ప సినిమా తో పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ..ఇప్పుడు బాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. అయితే, ఇంతటి పేరు సంపాదించుకున్న రష్మిక లాంటి హీరోయిన్ పై చాలా గాసిప్స్ నెట్టింట వైరల్ అవుతుంటాయి. కానీ, ఈ మధ్య కాలంలో అందులో ఒకటి హైలెట్ గా నిలిచింది. ఇక ఆ రూమర్ ని నిజం చేస్తూ రష్మిక అఫిషీయల్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది.

రష్మిక ..యంగ్‌ సెన్సేషనల్‌ హీరోతో రొమాన్స్ చేయబోతుందని రూమర్స్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలు నిజమే అంటూ రష్మిక క్లారిటీ ఇచ్చింది. రష్మిక మందన్నా.. బాలీవుడ్ యంగ్‌ హీరో టైగర్ ష్రాఫ్‌ కలిసి నటిస్తుందని బాలీవుడ్ మీడియా లో ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అయ్యాయి. అది నిజమే అంటూ తేల్చి చెప్పిన రష్మిక..అది సినిమా కోసం కాదు అని.. ఒక యాడ్‌ కోసం అంటూ క్లారిటీ ఇచ్చింది. దీనికి సంబంధించిన బూమరాంగ్ వీడియోను ఇన్‌స్టా వేదికగా పంచుకుంది రష్మిక. దీంతో అమ్మడు రేంజ్ ఇంకా పెరిగిపోయింది.