అది నిజమే..ఆ డైరెక్టర్ నన్ను ఇబ్బంది పెట్టారు..కృతి మాటలకు ఇండస్ట్రీ షాక్..!!

ఈ మధ్య కాలంలో కృతి శెట్టి పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. దానికి కారణం మనకు తెలిసిందే. అమ్మడు హాట్ అందాలు..ఓ ప్లస్ పాయింట్ అయితే.. ఏలాంటి రోల్ ని అయిన ఇట్టే పట్టేసి..జనాలను మెప్పించగలదు. ట్రెడిషినల్ గా సంగీత పాత్ర..శ్యామ్ సింగ రాయ్ సినిమాలో కీర్తిగా..బంగార్రాజు సినిమాలో నాగ లక్ష్మిగా..ఎలాంటి రోల్ లో అయినా..ఇట్టే ఇమిడిపోయి నటించగలదు. అంత టాలెంటెడ్ ఉన్న హీరోయిన్.

వరుసగా మూడు సినిమా లు హిట్ కొట్టి..బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న కృతి ప్రజెంట్ కోలీవుడ్ లో కూడా..సినిమాలు చేస్తూ..టాప్ హీరోయిన్ల లిస్ట్ లో ఉంది. ఆమె రీసెంట్ గా హీరోయిన్ గా నటించిన చిత్రం..”ది వారియర్” మూవి. కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ..ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో తెలుగు, తమిళంలో రిలీజ్ కానుంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన అన్ని పాటలు మంచి హిట్ అయ్యాయి. ముఖ్యంగా బుల్లెట్ బండి సాంగ్ అయితే యువతను అల్లాడిస్తుంది. “Common Baby lets go on a  Bulletu” అంటూ మొబైల్స్ లో పాటలు ఓ రేంజ్ లో వినిపిస్తున్నాయి. ఇక ఇన్స్టా లో రీల్స్ గురించి అయితే..చెప్పనవసరం లేదు. తాజాగా, ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యులో మాట్లాడుతూ..ఆమె దర్శకుడు లింగుస్వామీ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి.

” లింగుస్వామి గారు తమిళ డైరెక్టర్‌ కావడంతో నేను ఆయనతో ..భాష పరంగా కొంచెం ఇబ్బంది పడ్డాను. ఆయన తెలుగులో మాట్లాడిన నాకు అది తమిళంలోనే వినిపించేది. ఎందుకంటే ఆయన యాస అలా ఉంటుంది. నాకు తమిళం తెలియదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా..అందువల్ల ఆయన మాట్లాడే తెలుగు నాకు అర్థం కాక.. వార రోజుల పాటు చాలా ఇబ్బంది పడ్డాను. ఆ తరువాత రామ్‌ నాకు హెల్ప్ చేశాడు..”అంటూ చెప్పుకొచ్చింది.