బిగ్ షాకింగ్: “ది వారియర్” సినిమా స్టోరీ లీక్…?

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని..పోలీస్ ఆఫిసర్ గా నటిస్తున్న తాజా చిత్రం..”ది వారియర్”. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగు స్వామీ డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కింది. లింగు స్వామీ డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఢిఫరెంట్ కాన్సెప్ట్ తో..పక్క ప్లానింగ్ తో సినిమాలు తీస్తారు అన్న పేరు ఉంది. లింగుస్వామీ సినిమాలని చూసి జనాల నాడి పట్టి సినిమాలు తెరకెక్కిస్తారు అంటారు అందరు  .

కాగా, ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన అన్ని పాటలు, లుక్స్ , పోస్టర్స్ సినిమా పై భారీ అంచనాలను పెట్టుకునేలా చేసింది. మరీ ముఖ్యంగా బుల్లెట్ సాంగ్ అయితే ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా మరి కొద్ది గంటల్లోనే పేక్షకుల ముందుకు రానుంది. జూలై 14 న ఈ సినిమా ని గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అయితే, ఈ సినిమా స్టోరీ నెట్టింట లీకైన్నట్లు తెలుస్తుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం..సినిమా స్టోరీ అంతా ఫ్యామిలీ రీవేంజ్ డ్రామా గా ఉంటుందట. ఈ సినిమా కధ అంతా..కృతి శెట్టి, రామ్..నదియా, ఆది ..ఈ నలుగురి మధ్య తిరుగుతుందని..ఈ సినిమా ఇంటర్వెల్ లో వచ్చే ట్వీస్ట్ లో లింగుస్వామీ తన మార్క్ చూయించాడని..ఖచ్చితంగా రామ్ ఈ సినిమా ద్వార బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని ఓ టాక్ వినిపిస్తుంది.

కాగా,కన్నడ బ్యూటీ కృతి శెట్టి..ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో అమ్మడుని మనం ఇప్పటి వరకు చూడని మూడు సినిమాల్లో కన్నా..ఈ సినిమా ఢిఫరెంట్ గా చూడబోతున్నారు అని కృతి శెట్టినే స్వయంగా చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు విజిల్ మహాలక్ష్మి అని..ఆమె ఓ రెడీయో జాకీ గా పని చేస్తుందని..ఈ సినిమా ఖచ్చితంగా మీకు నచ్చుతుందని ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చింది.