ఇండస్ట్రీలో న్యూ వైరస్..కుర్ర హీరోలకు కొత్త ఫీవర్..ఇది మహా డేంజరండోయ్..!!

ఇండస్ట్రీలో న్యూ వైరస్..వచ్చిందా అంటే అవుననే అంటున్నారు సినీ వర్గాలు. ఆ వైరస్ కి పేరు లేదు కానీ..మహా డేంజర్ అంటూ దాని జోలికి పొవద్దు అంటు వార్న్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ వైరస్ కారణంగా కుర్ర హీరోలు బలైపోతున్నారు. నాచురల్ స్టార్ నాని, ఎనర్జిటిక్ హీరో రామ్ పొతినేని..అక్కినేని కుర్రాడు నాగ చైతన్య..అన్ని బాగుంటే ఆ వైరస్ లిస్ట్ లో పడబోతాడు హీరో నితిన్ కూడా..ఇప్పటికే అర్ధమైపోయిందా ఆ వైరస్ ఏంటో..పబ్లిసిటీ వైరస్. ఒకప్పుడు హీరోలు సినిమా చేయాలంటే కధను చూసేవారు.

 

కధ బాగుంటేనే సినిమాకి కమిట్ అయ్యేవారు. అది అసలైన హీరో లక్షణాలు. అది ప్రజెంట్ ఫాలో అవుతుంది నందమూరి బాలయ్య ఒక్కడే అని చెప్పాలి. ఆడియన్స్ కి నచ్చేలా సినిమా ల కధను చూస్ చేసుకోవడంలో బాలయ్య తరువాతే ఎవ్వరైన. సీనియర్ హీరోలు కూడా మంచి మంచి కధతో ముందుకు వెళ్తుంటే..నేటి కుర్ర హీరోలు మాత్రం..అదే పాత చింతకాయ పచ్చడి స్టైల్ ను ఫాలో అవుతున్నారు. ఎంత సేపు , రొమాన్స్ , లవ్ స్టోరీలు అంటూ తీసిన సినిమానే రెండు మూడు సార్లు తీస్తూ జనాలకు బొర్ కొట్టిస్తున్నారు. నాని అంటే సుందానికి సినిమా అదే కాన్ సెప్ట్ తో బోల్తా కొట్టింది.

ఈ సినిమాకి ఓ రేంజ్ లో పబ్లిసిటీ చేశారు. కానీ, వర్క్ అవుట్ అవ్వలేదు. అలానే రామ్ “ది వారియర్” సినిమా కూడా సేమ్ స్టోరి కొత్త దనం లేదు. ఈ సినిమాకి తమిళ్ , తెలుగు రెండిటిలోను పబ్లిసిటీ చేశారు. కానీ, రిజల్ట్ ఎలా వచ్చిందో మనకు తెలిసిందే. ఇక నిన్న కాక మొన్న వచ్చిన నాగ చైతన్య “ధ్యాంక్యూ” పరిస్ధితి చెప్పనవసరం లేదు. సినిమా చూసిన జనాలు ద్యాంక్యూ చెప్పేశారు. సినిమా నచ్చికాదు..ఇంత త్వరగా సినిమా ను కంప్లీట్ చేసినందుకు. అంత ఆడియన్స్ సహనాని పరిక్షింది ఆ సినిమా.’

ఇది పాత చింతకాయ పచ్చడే. ఇక ఇప్పుడు ఆ కొత్త ఫీవర్ జోలికి వెళ్లబోతున్నాడు నితిన్. మాచర్ల నియోజకవర్గం అంటూ టైటిల్ కొత్త గా పెట్టిన పోస్టర్స్ చూసి సినిమా స్టోరిని అంచనా వేయచ్చు. ఓల్డ్ స్టోరీకే కొద్ద హంగులు దిద్దుతూ సినిమా కంప్లీట్ చేశాడనే టాక్ మొదలైంది. పై కొత్త డైరెక్టర్..సినిమా గురించి హోప్స్ పెట్టుకోవడం కూడా దండగే అంటున్నారు విశ్లేషకులు. ఈ సినిమా కి నితిన్ ఓ రేంజ్ పబ్లిసిటీ షెడ్యూల్ ప్లాన్ చేసుకుని ఉన్నారట. ఈ ఫార్ములా నిజమైతే..నితిన్ ఆ న్యూ వైరస్ లిస్ట్ లో చేరిపోతాడు అంటున్నారు నెటిజన్స్. మరి చూదాలి నితిన్ ఏం చేస్తాడో..?

Share post:

Latest