బాల‌య్య `అన్ స్టాప‌బుల్‌`లో మ‌రో స్టార్ హీరో సంద‌డి..?!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా చేస్తున్న‌ ఫ‌స్ట్ షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ `ఆహా`లో ఈ షో ప్ర‌సారం అవుతోంది. సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ షోలో నాలుగు ఎపిసోడ్స్ పూర్తి కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు మోహ‌న్ బాబు ఫ్యామిలీ, నాని, అనిల్ రావిపూడి, బ్ర‌హ్మానందం, అఖండ సినిమా టీమ్ వ‌చ్చి ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచారు.

అలాగే ఐదో ఎపిసోడ్‌కి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, ఎమ్‌.ఎమ్‌.కీర‌వాణి గెస్ట్‌లుగా విచ్చేశారు. ఈ ఎపిసోడ్‌తో త్వ‌ర‌లోనే స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక తాజాగా నెక్స్ట్ ఎపిసోడ్ గురించి సూప‌ర్‌ అప్డేట్ బ‌య‌ట‌కు వచ్చింది. ఈ సారి బాలయ్య బాబుతో టాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ హీరో, మాస్ మహారాజ్ ర‌వితేజ సందడి చేయనున్నార‌ట‌.

ర‌వితేజ‌తో పాటు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గోపీచంద్ మలినేని సైతం కూడా రానున్నార‌ని, ప్ర‌స్తుతం ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన షూటింగ్ జ‌రుగుతోంద‌ని టాక్ న‌డుస్తోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

కాగా, బాల‌య్య సినిమాల విష‌యానికి వ‌స్తే.. అఖండ‌తో అఖండ విజయం సాధించి ఫుల్ ఖుషీలో ఉన్న ఆయ‌న త‌న తదుప‌రి చిత్రాన్ని గోపీచంద్ మ‌లినేనితో ప్ర‌క‌టించారు. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ మూవీలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇక ఈ చిత్రం పూర్తైన త‌ర్వాత బాల‌య్య అనిల్ రావిపూడితో ఓ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రం చేయ‌నున్నాడు.

Share post:

Latest