క‌మ్యూనిస్టుల వైభ‌వం.. గ‌త చ‌రిత్రేనా..?

ఒక‌ప్పుడు రాష్ట్రంలో క‌మ్యూనిస్టుల‌కు రాజ‌కీయంగా చెప్పుకోద‌గిన స్థాయిలో ప‌ట్టుండేది. అధికారం చేజిక్కించుకోగ‌ల స్థాయిని ఏనాడూ చేరుకోలేక పోయినా… నిరంత‌రం ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడుతూ త‌మకంటూ కొంత ఓటు బ్యాంకును స్థిరంగా నిలుపుకోగ‌లిగేవారు. ప్ర‌ధాన పార్టీల‌తో స‌మయానుకూలంగా పొత్తుల‌తో చ‌ట్ట స‌భ‌ల్లో త‌మ ప్రాతినిధ్యం ఉండేలా.. త‌మ వాయిస్ గ‌ట్టిగా విన‌ప‌డేలా చూసుకునేవారు. అయితే ప్రాంతీయ పార్టీల హ‌వా పెర‌గ‌డం.., వాస్త‌వ ప‌రిస్థితుల‌ను గ్ర‌హించ‌లేక పోవ‌డం.., కాలం చెల్లిన విధానాల‌ను, పిడివాదాన్ని న‌మ్ముకోవ‌డంతో క‌మ్యూనిస్టుల బ‌లం త‌రిగిపోతూ వ‌చ్చింది. […]