ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఇండియా లెవెల్‌లో పరిచయం అవసరం లేని పేరు. దేశంలో ఎంతో మంది పొలిటికల్ లీడర్స్ ఉన్న చంద్రబాబు నాయుడుకు ఒక డిఫరెంట్ ఇమేజ్ ఉంది. ఆయన విజన్.. ఆలోచన విధానం.. ఎంతోమందికి అదర్శం. చంద్రన్న ఆలోచన ఏదైనా భవిష్యత్‌కు ఉపయోగపడాలి.. బుందు తరాలు బాగు పడాలనే ప్లాన్ చేస్తాడు. ఏ పని చేసిన ప్రస్తుతం గడిచిపోయిందా లేదా అన్నట్లు కాకుండా.. భవిష్యత్తులో ఎలా ఉపయోగపడుతుందని ఆలోచనలలో చంద్రబాబు ఉంటారు. మసిపూసి మారేడు కాయ చేసి.. పథకాల నేరుతో డెవలప్‌మెంట్ వెనక్కు తోసి.. మబిపెట్టే టైప్ ఆయన కాదు.
అలాంటి చంద్రన్న సీఎంగా మొట్టమొదటిసారి గెలిచి నేటితో 30 సంవత్సరాల అయింది. అప్పటి నుంచి ఇప్పటికి ఆయన గెలుపు, ఓటమి అని సంబంధం లేకుండా.. ప్రజల శ్రేయస్సు కోసమే పాటుపడుతూ వస్తున్నాడు. ఈ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో.. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న చంద్రన్న.. ప్రజల మంచి కోసమే కష్టపడ్డాడు. అవమానంతో కన్నీళ్లు కూడా పెట్టాడు. ఇక చంద్రబాబు మొదటిసారి 1995లో సెప్టెంబర్ 1 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నెగ్గాడు.
ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. ఇండియన్ పాలిటిక్స్ శాసించే రేంజ్ కు ఎదిగాడు. ఆయన గవర్నమెంట్‌లో ఎన్నో ఉపయోగకర పథకాలు తీసుకువచ్చి లక్షలాది మందికి అండగా నిలిచాడు. ఇప్పటికి ఆయన చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలు చాలామందికి కడుపు నింపడానికి ఉపయోగపడుతున్న. ముఖ్యంగా చంద్రన్న ప్రవేశపెట్టిన పథకాలలో జన్మభూమి, శ్రమదానం ఎంత గొప్ప పేరును తెచ్చుకున్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో భాగమైన హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణమే చంద్రన్న. హైదరాబాద్‌ను హైటెక్ సిటీగా దిద్దడు. ఇదే విషయాన్ని అక్కడ పొలిటిషన్ సైతం ఒప్పుకోక తప్పదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇన్ని ఐటి కంపెనీలు.. ఇంతమంది ఉద్యోగులకు జీవనోపాధి దొరికిందంటే అది చంద్రబాబు చలవే. వారి భవిష్యత్తుకు బాటలు వేశాడు.
ఉమ్మడి ఆంధ్ర విభజన తర్వాత సీఎం గా 2014 – 19 వరకు బాధ్యతలు నిర్వహించారు. ఇక గతేడాది ఎన్నికల్లో మరోసారి కూటమి ప్రభుత్వంగా ఏర్పడి సక్సెస్ అందుకున్నాడు. అలా ఇప్పటివరకు నాలుగు సార్లు ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన చంద్రన్న.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ తరాల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి కష్టపడుతున్నారు. ప్రస్తుతం సెంటర్ లెవెల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే అందులో చంద్రబాబు పాత్ర కూడా కీలకమనడంలో సందేహం లేదు. ఇలా.. చంద్రబాబు రాష్ట్ర, దేశ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తూ తన విజన్.. ప్రజలకు మంచి చేయాలని తపనతో ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.