టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా.. కియారా అద్వాని హీరోయిన్గా, అంజలి ప్రధాన పాత్రలో నటించిన మూవీ గేమ్ ఛేంజర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. పొలిటికల్ కమర్షియల్ డ్రామాగా రూపొందిన గేమ్ ఛేంజర్ రిలీజ్ కు ముందు నుంచే ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలను నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా బుకింగ్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా అంటూ బాలయ్య అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రియులు కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు.
ఇలాంటి నేపద్యంలో సినిమా బుకింగ్స్ విషయంలో తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా నైజాంలో పెద్ద సస్పెన్షన్ నడిచింది. కాక నిన్న అర్ధరాత్రి సమయంలో అలా బుకింగ్స్ ఓపెన్ చేశారు ముకర్స్. అలా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయో లేదో హైదరాబాద్ సిటీలో గేమ్ ఛేంజర్ ప్రభంజనం సృష్టించింది. కేవలం బుకింగ్స్ ఓపెన్ అయిన గంటలోనే కోటి రూపాయలకు గ్ఆస్ కలెక్ట్ చేసి సత్తా చాటుకుంది. ఈ క్రమంలోనే అప్పటికే చాలా చోట్ల హౌస్ఫుల్ పడిపోగా.. మరికొన్ని ప్రాంతాల్లో సినిమా బుకింగ్స్ మంచి ఫాస్ట్ ఫిలింగ్స్ నడిచాయి.
దీంతో గేమ్ ఛేంజర్ బుకింగ్స్ లేటుగా మొదలైన సాలిడ్ ఫిలింగ్‌తో పూర్తయిపోయాయి అనడంలో సందేహం లేదు. ఇక తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోయినా.. కేవలం ఏపీ బెనిఫిట్ షో బుకింగ్స్‌తోనే గేమ్ ఛేంజర్ అన్ని ఏరియాలో కలుపుకొని దాదాపు రూ.5 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. ఇక తాజాగా సినిమా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో సినిమా మరిన్ని రికార్డులు కొల్లగొట్టడం ఖయమని అభిమానులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.