మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ ఛేంజర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో ఈ సినిమా సాలిడ్ పొలిటికల్ డ్రామాగా ఆడియన్స్ను పలకరించింది. అయితే ఆర్ఆర్‌ఆర్, ఆచార్య తర్వాత వస్తున్న సోలో సినిమా కావడంతో.. రిలీజ్ కి ముందు సినిమాపై మంచి అంచనాలను నెలకొన్నాయి. కాగా ప్రస్తుతం మన టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా లెఎల్ ఇమేజ్ వచ్చిన తర్వాత నార్త్ మార్కెట్ పై ప్రత్యేక దృష్టి సారించి సక్సెస్ అందుకోవడానికి కసిగా ప్రయత్నిస్తున్నారు.
వారిలో రాంచరణ్ కూడా ఒకరు. ఇలాంటి నేపథ్యంలోనే చరణ్ నుంచి వచ్చిన గేమ్ ఛేంజర్‌కు కూడా.. నార్త్ మార్కెట్‌లో వసూళ్ల పట్ల ఆసక్తి నెలకొంది. మొదట నార్త్ లో సినిమాపై అసలు హైప్ లేదని వార్తలు వైరల్ అయినా.. ప్రస్తుతం బుక్ మై షో ఇతర గణాంకాల లెక్కల ప్రకారం ముంబై మరియు కొన్ని మేజర్ సిటీస్లో.. అలాగే పలు సింగిల్ స్క్రీన్స్ కి గేమ్ ఛేంజర్ నుంచి డీసెంట్ బుకింగ్స్ నమోదు అయినట్లు తెలుస్తుంది. అలా.. చాలా చోట్ల సాయంత్రం షోస్‌కి భారీ రేంజ్‌లో టికెట్స్ బుక్ అవుతుండడం విశేషం.
దీన్ని బట్టి నార్త్ లో సరైన ప్రమోషన్స్ లేకున్నా మంచి రేంజ్ లోనే బుకింగ్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే హిందీలో గేమ్ చేంజర్ మంచి నెంబర్ అందుకనే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇలాంటి క్రమంలో తాజాగా రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్ నార్త్ ఆడియన్స్‌ను మెప్పించి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం ఈ సినిమా కలెక్షన్ల పరంగా నార్త్ లోను రికార్డులు క్రియేట్ చేయడం కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ మూవీ అక్కడ డే వన్ లో అక్కడ ఎలాంటి కలెక్షన్‌లు సాధిస్తుందో వేచి చూడాలి.