మన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంక్రాంతి పండుగ అంటే పెద్ద పండుగ అనడంలో సందేహం లేదు. ఎప్పటికప్పుడు సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యే సినిమాల మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుంది. అంతేకాదు సంక్రాంతి బరిలో చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు స్టార్ డైరెక్టర్ నుంచి ప్రొడ్యూసర్ల వరకు ఎంతో మంది తమ సినిమాలను రిలీజ్ చేయాలని ఆరాటపడుతూ ఉంటారు. అలాగే ఈ ఏడాదిలోను తమ సినిమాలను రిలీజ్ చేయాలని ఎంతోమంది పోటీపడినా చివరకు మూడు సినిమాలు సంక్రాంతి రేస్‌లో పోటీకి సిద్ధమయ్యాయి.
ఈ క్రమంలోని ఏడాది సంక్రాంతికి కూడా స్టార్ హీరోల సాలిడ్ సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఆ సినిమాలో గ్లోబల్ స్టార్ చరణ్ గేమ్ ఛేంజర్ నందమూరి నటసింహం బాలయ్య.. డాకు మహారాజ్ తో పాటు.. విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఇప్పటివరకు మన టాలీవుడ్ దగ్గర సంక్రాంతి కింగ్ గా నిలిచి ఆల్ టైం రికార్డ్ వసూళ్లను సొంతం చేసుకుంది హనుమాన్.
చిన్న సినిమాగా యంగ్ హీరో తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా టాలీవుడ్ లో కలెక్షన్ల పరంగా చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే గతేడాది హనుమాన్ సెట్ చేసిన రికార్డును ఈ ఏడాదిలో రిలీజ్ అయ్యే మూడు సినిమాల్లో ఏ మూవీ అయినా బ్రేక్ చేస్తుందా.. లేదా.. అనే ఆసక్తి అభిమానుల మొదలైంది. అయితే హనుమాన్ సంక్రాంతి బరిలో రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళను కొల్లగొట్టి సంక్రాంతి కింగ్‌గా నిలిచింది. అలా ఈ ఏడాదిలో పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అవుతున్న సినిమా గేమ్ ఛేంజర్ ఈ సినిమా రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.