టాలీవుడ్ యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తాజాగా ఈ అమ్మడుకు ఆకతాయి వేధింపులు ఎదురయ్యాయి. తాజాగా సోషల్ మీడియాలో తనను అత్యాచారం చేస్తాం, హత్య చేస్తాం అని బెదిరిస్తున్న ఓ వ్యక్తిపై.. నిధి అగర్వాల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని తాను ఇచ్చిన ఫిర్యాదులో ఆమె వెల్లడించింది. దీంతో నిధి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. వెంటనే విచారణ మొదలుపెట్టారు.
అయితే నిధి అగర్వాల్‌తో అసభ్యకరంగా మాట్లాడుతూ ఆమెను బెదిరిస్తున్న వ్యక్తి తనతో పాటు ఆమెకు ఇష్టమైన వారిని ఫ్యామిలీని కూడా టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఈమె ఈ ఫిర్యాదులో వివరించింది. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో సినీ హీరోయిన్స్ పై ఆకతాయి వేధింపులు ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేస్ ఫైల్ చేసిన నోట్ నెట్టింట వైరల్ గా మారుతుంది. అయితే అది ఏ ఏరియా అనేదానిపై మాత్రం క్లారిటీ రాలేదు. నిన్నటికి నిన్న మలయాళ హీరోయిన్ హనీరోజ్ వేధించిన కేసులో ఓ టాప్ బిజినెస్ మ్యాన్‌ని కేరళ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అంతే కాదు తనపై సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్స్ కూడా వెలువడుతున్నాయి. మరో 30 మంది పేర్లు కూడా ఈ కేసులో నమోదు చేశారు. ఇక ఈ కేసు ఒక కొలిక్కి రాకముందే మరో హీరోయిన్ అక్కుతాయి వేదింపులకు గురవడం నెటింట హాట్ టాపిక్‌గా మారింది. సవ్యసాచితో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిధి.. ఇస్మార్ట్ శంకర్‌తో బ్లాక్ బస్టర్ అందుకుంది. తర్వాత కొలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన ఆమె.. కొంతకాలానికి మళ్ళీ టాలీవుడ్ కి వచ్చి ఇక్కడ బిజీ అయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జంటగా హరిహర వీరమల్లు సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న రాజా సాబ్ తోనే ఆడియన్స్‌ను పలకరించనుంది.