బాలయ్య ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. అక్కడ సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న డాకు మహారాజ్..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ హీరోగా.. సక్సెస్ఫుల్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెర‌కెక్క‌నున్న‌ తాజా మూవీ డాకు మహారాజ్. మరో మూడు రోజులో సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. గ్రాండ్ లెవల్‌లో ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్‌ను పలకరించనున్న ఈ సినిమాకు.. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ రిలీజై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

Balakrishna : 'డాకు మహారాజ్' ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేసింది - TeluguBulletin.com

ఇక సినిమా టికెట్ బుకింగ్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయా అంటూ.. బాలయ్య అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి క్రమంలో తమిళ్, హిందీ భాషల అభిమానులకు.. మేకర్స్ బిగ్ షాక్ ఇచ్చారు. డాకు మహ‌రాజ్‌ సినిమాను.. తమిళ్, హిందీ వర్షన్‌లలో జనవరి 12న రిలీజ్ చేయడం లేదని.. ఈనెల 17న అక్కడ ఏరియాలో సినిమా రిలీజ్ అవుతుంది అంటూ వివరించారు. దీంతో సంక్రాంతి బరిలో బాలయ్య సినిమా చూసే అవ‌కాశం అభిమానులు మిస్ అయిపోయినట్టే.

Daku Maharaj is not the title of NBK 109 Balakrishna Shraddha Srinath |  Balakrishna: బాలకృష్ణ సినిమా టైటిల్ అది కాదు... జస్ట్ రూమర్ అంతే!

ఈ విషయం ఎలా ఉంటే.. గత ఏడాది ప్రముఖ డైరెక్టర్ గోపీచంద్ డైరెక్షన్‌లో వచ్చిన వీర సింహారెడ్డి సినిమాతో బాలయ్య బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాతో రూ.134 కోట్ల గ్రాస్వసులను కొల్లగొట్టిన బాలయ్య.. తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో భగవంత్‌ కేసరితో ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించాడు. ఈ సినిమా కూడా హిట్ టాక్ సంపాదించుకుంది. అలా ఒకే ఏడాదిలో రెండు సాలిడ్ హిట్లు అందుకున్న బాలయ్య.. ఈ ఏడాది డాకు మహారాజుతో సంక్రాంతి బరిలో సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమాతో ఆడియన్స్‌ను ఏ రేంజ్ లో మెప్పిస్తాడో.. ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.