తారక్ టచ్ చేయలేకపోయాడు.. చరణ్ వల్ల అవుతుందా..?

పాన్ ఇండియా లెవెల్‌లో ఓ హీరో నుంచి సినిమా రిలీజై బ్లాక్ బ‌స్టర్‌గా నిలిస్తే.. ఆ తర్వాత హీరో నుంచి రాబోతున్న నెక్స్ట్ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందని ఆసక్తి నేషనల్ ఆడియన్స్ లో ఉంటుంది. అయితే ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి పాన్‌ ఇండియన్ స్టార్లుగా ఎదిగిన వారిలో.. బాహుబలి తర్వాత ప్రభాస్ మార్కెట్ పెరిగినట్లు.. మిగతా హీరోల మార్కెట్ పెరిగిందా అంటే చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా.. “ఆర్‌ఆర్ఆర్ తర్వాత ఈ సినిమాలో నటించిన జూనియర్ ఎన్టీఆర్ నుంచి.. ‘ దేవర ‘ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది. అయితే నార్త్ ఇండియాలో ఇది పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది ” . ఇక ఈ సినిమాలో మరో హీరో రామ్ చరణ్ నటించగా.. గేమ్ ఛేంజ‌ర్‌ త్వరలోనే ఆడియన్స్‌ని పలకరించనుంది. అయితే చరణ్ ఆర్‌ఆర్ఆర్ తర్వాత.. ఆచార్య సినిమా నటించాడు.

కానీ.. అతనిది లీడ్‌రోల్‌ కాదు. మెగాస్టార్ అందులో ప్రధాన పాత్ర నటించారు. పైగా అది ఆల్ ఇండియా సినిమా కానే కాదు. ఇక సినిమా పూర్తి డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది అభిమానులు గేమ్ ఛేంజ‌ర్‌పై హోప్స్ పెట్టుకున్నారు. కాగా సినిమా రిలీజ్ బాగా ఆలస్యం అవుతుండడం.. మధ్యలో శంకర్ నుంచి వచ్చిన ఇండియన్ 2 డిజాస్టర్ కావడంతో గేమ్ ఛేంజర్ విషయంలో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ఈ క్రమంలోనే గేమ్ ఛేంజ‌ర్‌ పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ పాస్టర్ కావడం కష్టమే అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ సాధించాలంటే ప్రీ రిలీజ్ బజ్‌ ఎంతగానో ముఖ్యం. అయితే గేమ్ ఛేంజ‌ర్‌ ఇప్పటివరకు ఆ రేంజ్ లో బజ్ కనిపించలేదని పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలుగు సినిమాలకు కన్నడలో ఎప్పుడు మంచి హైట్ ఉంటుంది. ఇక కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ మూవీ క‌నుక‌ తమిళ్ లోను ఈ సినిమాపై మంచి బ‌జ్‌ నెలకొంది. ఈ రాష్ట్రాలను మినహాయిస్తే గేమ్ ఛేంజ‌ర్ బ‌జ్ కనిపించలేదు. ముఖ్యంగా పాన్‌ ఇండియా సక్సెస్ కు కీలకమైన నార్త్‌లో గేమ్ ఛేంజ‌ర్ అనుకున్నంత బాజ్‌ క్రియేట్ చేసుకోలేదు. అక్కడ ప్రేక్షకులు సినిమాపై మరింత ఎక్సైట్ అవ్వాలంటే బాహుబలి రేంజ్ ఈవెంట్ ఫిలిం అయ్యుండాలి.. లేదా కేజిఎఫ్, పుష్ప తరహాలో కంటెంట్ డిఫరెంట్ వ‌ర‌ల్డ్‌లో ఉండి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలి. ఇవేమీ గేమ్ ఛేంజ‌ర్‌లో కనిపించడం లేదు. ట్రైలర్ లోను పెద్ద సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏవి లేవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి క్రమంలో సినిమా రిలీజ్ అయినా.. ప్రీమియర్ షోకు పాజిటివ్ టాక్ రావడం ఎంతో ముఖ్యం. అదే కాదు.. కంటెంట్ కూడా కాస్త వైవిధ్యత కనిపిస్తేనే ఈ సినిమా నేషనల్ లెవెల్ లో సక్సెస్ అందుకుంటుంది. మరి అలాంటి మ్యాజిక్ శంకర్ తన సినిమాతో క్రియేట్ చేయగలడో.. లేదో.. వేచి చూడాల్సిందే.