టాలీవుడ్‌లో ఈ ఏడాది సంక్రాంతి మూడు సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. వాటిల్లో గేమ్ ఛేంజర్ కూడా ఒకటి. పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. కియారా అద్వానీ హీరోయిన్గా నటించగా.. అంజలి, సముద్రఖని, ఎస్. జె. సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర కీలకపాత్రలో కనిపించనున్నారు. భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ టాక్‌తో దూసుకుపోతుంది.
ఈ క్రమంలోనే సినిమా నటినటుల రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే ఈ సినిమాలో 2021 లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి సినిమాను ల్యాగ్ చేసుకుంటూ 2024 కి ముగించారు. ఈ క్రమంలోనే షూటింగ్ మరింత శ్లో కావడంతో.. బడ్జెట్ సమస్యలు ఏర్పడి దిల్ రాజు.. చరణ్ రెమ్యూనరేషన్ లో కోతపెట్టారని జమాచారం. ఇక తాజా నివేదిక ప్రకారం.. చరణ్ సినిమా కోసం రూ.65 కోట్ల వరకు పారితోషకం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా కంటే ముందే చరణ్ ఒక్కో సినిమాకు రూ. 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని రూ.7 కోట్ల రెమ్యునరేషన్ రేషన్ చార్జ్ చేసిందట. డైరెక్టర్ శంకర్ రూ.35 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది. గేమ్ చేంజర్ పూర్తి బడ్జెట్ రూ.450 కోట్లు కాగా.. ఈ సినిమాలో నటించిన అంజలి,సూర్య, నవీన్ చంద్ర, సముద్రఖని తదితరులు అందరికీ కూడా రెమ్యూనరేషన్లు భారీ లెవెల్లో ఇచ్చినట్లు సమాచారం.