ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్టీఆర్.. తర్వాత దేవర సినిమాతో మరోసారి సక్సెస్ అందుకొని మంచి స్వింగ్ లో ఉన్నారు. ఇదిలా ఉండగా బాలీవుడ్‌లో అవకాశం దక్కించుకున్న హృతిక్ రోషన్‌తో కలిసి వార్2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని మల్టీ స్టారర్ పై ఆడియన్స్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అయితే వార్ 2 తర్వాత కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో తారక్ మరో సినిమాను అనౌన్స్ చేశారు. వాస్తవానికి ప్రశాంత్, తారక్ కాంబోలో ఆర్‌ఆర్ఆర్ కంటే ముందే ఓ సినిమా రావాల్సి ఉంది. కానీ.. దానికి ఆలస్యం అవుతూ వచ్చింది. ఈలోపు దేవర కూడా సెట్స్‌పైకి వచ్చి రిలీజ్ అయిపోయింది.
అయితే ప్రాజెక్ట్ లేట్ అయినా.. డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో లేటెస్ట్గా ఆడియన్స్‌ను ఆకట్టుకునే కంటెంట్ ప్రశాంత్ సినిమా రానుందట. రుక్మిణి వసంత్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించనుంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సంక్రాంతి తర్వాత నుంచి ప్రారంభం కానుందని సమాచారం. అయితే ఫిబ్రవరి చివరి వారి నుంచి జరిగే షెడ్యూల్ నుంచి తారక్ పాల్గొంటారు అని తెలుస్తుంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టును సమ్మర్లో ప్రారంభించాలని భావించారట. కానీ.. రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ అనన్స్ చేశారు. ఈ క్రమంలోనే సినిమాను ఆలస్యం చేయడం ఎందుకన్నా ఉద్దేశంతోనే.. ఈ ఏడాది జనవరి 9 నుంచి సినిమాను సెట్స్‌పైకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
ఇక తాజాగా సినిమా టీజర్‌ని కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో వార్త నెటింట వైరల్‌గా మారుతుంది. డ్రగ్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉందని.. సినిమా షూటింగ్ అంతా విదేశాల్లో జరగనున్నట్లు సమాచారం. థాయిలాండ్, మయన్మార్, లూయిస్ లాంటి ప్రాంతాల్లో షూటింగ్ ప్లాన్ చేశారట. ఈ మూడు దేశాల్లో ఉండే డ్రగ్స్ మాఫియా నేపద్యంలో సినిమా ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఉండనుందని ఇన్సైడ్ వర్గాల టాక్. ఇక తారక్ ఇప్పటివరకు కనిపించని సరికొత్త జానెర్ తో ఆడియన్స్ ను పలకరించునున్నారు. తరక్‌కు సినిమా ఎలాంటి స్టేటస్ తెచ్చి పెడుతుందో వేచి చూడాలి.