తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలుగా అడుగుపెట్టి స్టార్ హీరోలుగా పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. తమకంటూ సపరేట్ ఐడెంటిటీ సంపాదించుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయితే తెలుగు ఆడియన్స్‌లో నందమూరి హీరోల క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ కుటుంబంలో ఎక్కువగా బాలయ్య, ఎన్టీఆర్ నందమూరి కుటుంబ ఖ్యాతిని మరింత పెంచేందుకు ఎప్పటికప్పుడు పోటీ పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం బాలయ్య టాలీవుడ్‌లో హ్యాట్రిక్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక తారక్ పాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ అందుకుని రాణిస్తున్నాడు. అయితే ప్రస్తుతం వెళ్ళ మధ్య వివాదాలు నడుస్తున్నాయని.. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదంటే ఎన్నో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
దానికి తగ్గట్టుగానే వీరు వ్యవహరిస్తున్న తీరు కూడా ఆడియన్స్ సందేహాలు రేపుతుంది. ఇలాంటి క్రమంలో వీళిద్దరి కాంబోలో గతంలో మల్టిస్టారర్‌ని మిస్ అయిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో బోయపాటి శ్రీను.. ఎన్టీఆర్ తో దమ్ము సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య, ఎన్టీఆర్ కాంబోలో ఓ మంచి మల్టీస్టారర్‌కు ఆయన ప్లాన్ చేసుకున్నరట. అయితే ఈ సినిమా ఎందుకో సెట్స్ పైకి రాలేదు. ఓ పవర్ఫుల్ బ్లాక్ బస్టర్ స్టోరీని మల్టీ స్టారర్‌గా వీళ్ళిద్దరితో తీయాలనుకున్న బోయపాటి.. ఇద్దరినీ ఒప్పించారట. అప్పట్లో వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండడంతో.. సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
అయితే ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీగా ఉండడంతో షెడ్యూల్ పూర్తయిన తర్వాత సినిమా చేద్దామని భావించారు. కానీ.. తర్వాత బోయపాటి కొన్ని సందర్భాల్లో ఈ సినిమా ప్రపోజల్లు తిరిగి లేవనెత్తిన ఇద్దరు ఆసక్తి చూపలేదని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ కాంబోలో సినిమా వచ్చే అవకాశాలు లేవు. అయితే.. బాలయ్య తనయుడు మోక్షజ్ఞతో, జూనియర్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్ వచ్చా ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. తాజాగా మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. కథలను జాగ్రత్తగా ఎంచుకుంటూ.. స్టార్ హీరో రేంజ్ కు ఎదిగితే ఫ్యూచర్లో ఇద్దరు స్టార్ హీరోల కాంబోలో మల్టీ స్టారర్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.