పరిచయం :
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ఈరోజు థియేటర్లలో రిలీజ్ అయింది. దాదాపు 3 – 4 సంవత్సరాలుగా షూటింగ్ జరుగుతూ వచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌కు శంకర్ దర్శకుడు. చరణ్ సోలో హీరోగా దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు రావడంతో మంచి క్రేజ్ వచ్చింది. త్రిబుల్ ఆర్ సినిమాతో ఎక్కడలేని క్రేజ్ తెచ్చుకున్న చరణ్ పాన్ ఇండియాలో మరోసారి స్టార్ డం నిరూపించుకునేందుకు బరిలోకి దిగాడు. చాలా యేళ్లుగా తన స్థాయికి తగిన విజయం లేని శంకర్ ఈ సినిమాతో ఫామ్ లోకి రావాలని బాగా కష్టపడ్డారు. మరి ఈ సినిమా ఎలా ?ఉందో సమీక్షలో చూద్దాం.కథ :
ఐఏఎస్ ఆఫీసర్ రామ్ నందన్ ( రాంచరణ్ ) సివిల్ పరీక్ష సివిల్స్ పరీక్ష రాసి ఐఏఎస్ అవుతాడు. కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న వెంటనే అవినీతి చేసేవారిపై ఉక్కు పాదం మోపుతాడు. దౌర్జన్యాలు.. అవినీతి మానేయాలని రౌడీలు.. వ్యాపారులకు వార్నింగ్ ఇస్తాడు. దీపిక ( కైరా అద్వాని) తో రామ్‌నందన్‌కు బ్రేకప్ పై ఉంటుంది.. ఇద్దరు మళ్ళీ కలుసుకుంటారు. ఇది ఇలా ఉంటే ముఖ్యమంత్రిగా ఉండే బొబ్బిలి సత్యమూర్తి ( శ్రీకాంత్ ) అవినీతి మానేయాలని మంత్రులు.. ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇస్తాడు. ఒకప్పుడు తాను అప్పన్న ( రామ్ చరణ్ ) కు చేసిన వెన్నుపోటును.. అన్యాయాన్ని తలుచుకొని పశ్చాత్తాప పడుతూ ఉంటాడు. తండ్రి ఉన్న సీఎం సీటు పై ఆశలు పెట్టుకున్నా మంత్రి బొబ్బిలి మోపిదేవి ( ఎస్ జె సూర్య) కు ఇది నచ్చదు. మరోవైపు కలెక్టర్ రామ్ నందన్‌ను కూడా మోపిదేవి దందాలు ఆపినందుకు టార్గెట్ చేస్తాడు. తన కుట్రలతో సీఎం సీటు దక్కించుకున్న మోపిదేవిని ( రామ్ నందన్ ) అడ్డుకుంటాడు. ఈ టైంలో సత్యమూర్తి చివరి కోరిక తో భారీ ట్విస్ట్ ఎదురవుతుంది .. రామ్ నందన్ గతం గురించి ? ఆ తర్వాత ఎన్నికలు జరగడం… మోపిదేవిని రామనందన్ ఎలా అడ్డుకున్నాడు ? అతడు గతం ఏమిటి ? అప్పన్న ( రామ్‌చరణ్) పార్వతి ( అంజలి ) చేసిన పోరాటం ఏంటి వారికి ఏమైంది ? రాంతో వారికి ఉన్న సంబంధం ఏంటి ఎన్నికలు ఎలా సాగాయి ? అప్పన్న ఆశయాలను రామ్‌నందన్ రాం పూర్తి చేశాడా ? లేదా అన్నది గేమ్ ఛేంజర్ సినిమా చూసి తెలుసుకోవాలి.విశ్లేషణ :
రోబో తర్వాత శంకర్ వరుసగా పరాజయాలు ఎదుర్కొంటున్నాడు. ఇండియన్ 2 డిజాస్టర్ అవడంతో శంకర్ పై అంచనాలు తగ్గిపోయాయి. గేమ్ ఛేంజర్ సినిమాకు తమిళ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథ అందించడం ఆసక్తి రేకెత్తించింది. కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు అందించిన కథ కొత్తగా లేదు.. అవినీతి ఐఏఎస్ అధికారిని అడ్డుకోవడం.. సీఎం సీటు కోసం అతని కొడుకు కుట్రలు పన్నటం .. రాజకీయాల్లో ఎత్తులు … ఆదర్శాలను నమ్మిన వ్యక్తిని నమ్మినవారే వెన్నుపోటు పొడవటం.. అన్యాయం చేసిన వారికి అతడి వారసుడు దెబ్బతీయటం చుట్టూ కథ సాగుతుంది. అయితే ఈ కథలో అక్కడక్కడ మెరుపులన్నీ జోడించారు సుబ్బరాజు. ఇంటర్వెల్‌తో పాటు కథలో మలుపులు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కథ మరి కొత్తది కాకపోయినా మంచి మెసేజ్ ఉంది. ఈ సినిమా కథనాన్ని దర్శకుడు శంకర్ రొటీన్ గా మొదలుపెట్టాడు. పొలిటికల్ యాంగిల్ పరిచయం చేసి ఆ తర్వాత అవినీతిని.. పొలంలోనూ పనులను కలెక్టర్ రామ్ అడ్డుకునే సీన్లు బాగుంటాయి.. ఎలివేషన్లు హుషారుగా ఉంటాయి. సినిమాలో లవ్ ట్రాక్ శంకర్ ఆకట్టుకునేలా నడపలేకపోయాడు.
రామ్ చరణ్ హీరో కాలేజ్ ఎపిసోడ్లు బోరింగ్.. కోపాన్ని తగ్గించుకునేందుకు రాం చేసే ప్రయత్నాలు ఆకట్టుకోవు. లవ్ ట్రాక్ పెద్దగా కనెక్ట్ కాలేదు.. దీంతో ఫస్టాఫ్ కాస్త సాగదీతగా ఉంటుంది. సునీల్తో ట్రై చేసిన కామెడీ కూడా వర్కౌట్ కాలేదు. బ్రహ్మానందం ఓ సీన్లో కనిపిస్తారు. కలెక్టర్ రామ్ – మంత్రి మోపిదేవి మధ్య ఉండే పోటాపోటీ సీను ఆసక్తిగా ఉంటాయి. సీఎం సీటు కోసం మోపిదేవి పడే ఆరాటంతో పాటు రాజకీయ ఎత్తులు కూడా బాగానే అనిపిస్తాయి. సినిమాలో ఇంటర్వెల్ ముందు పావుగంట అదిరిపోతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాపై ఇంట్రెస్ట్ పెంచుతుంది. సెకండాఫ్ లో ఏం జరుగుతుందనే ? ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇంటర్వెల్ తర్వాత అప్పన్న ఉండే సీన్లు చాలా బాగుంటాయి. ప్రజల కోసం పోరాడే పాత్ర ప్రేక్షకులను ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తుంది. అప్పన్న పాత్ర కాసేపే కనిపించిన అలా గుర్తుండిపోతుంది. అప్పన్నను మోసం చేసే సీన్లు కూడా ఆసక్తిగా ఉంటాయి. రాజకీయ పార్టీల్లోనూ డబ్బు ఎలాంటి చిచ్చు పెడుతుందో చూపించారు. తర్వాత నుంచి కథనం మన ఊహలకు తగినట్టే సాగుతుంది.. ఏ మాత్రం ఆసక్తి ఉండదు. చివర్లో పథకాల గురించి కలెక్టర్ చెప్పటం.. ఇప్పటి రాజకీయ నేతలకు సందేశం ఇచ్చినట్టుగా ఉంటుంది.ఎన్నికల సంఘం పూర్తి పవర్ వాడితే ఎన్నికలను ఎంత పగడ్బందీగా నిర్వహించవచ్చు అన్నది సెకండ్ హాఫ్ లో చూపించారు.. పాటలు గ్రాండ్ గా ఉన్నాయి. చరణ్ స్టెప్పులు అదిరిపోయాయి. దర్శకుడు శంకర్ కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ లో వీక్ లో లవ్ స్టోరీ గేమ్ కింద విషయంలో శంకర్ మెసేజ్ బాగున్న ప్రేక్షకుల హృదయాల్లో నాటుకు పోయేలా కరెక్ట్ అయ్యేలా చూపించలేకపోయారు.. ఈ సినిమాతో ఆయన జస్ట్ ఓకే అనిపించారు.. సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. దిల్ రాజు – శిరీష్ పెట్టిన బడ్జెట్ తెరపై కనిపిస్తుంది. రామ్ చరణ్ నటన సినిమాకి హైలైట్. కియారా తేలిపోయింది. అంజలి పాత్ర ఎమోషనల్ గా ఆకట్టుకుంది. శ్రీకాంత్ – సముద్రఖని – నవీన్ చంద్ర – సునీల్ ఉన్నంతలో మెప్పించారు.ఫైనల్‌గా..
గేమ్ ఛేంజర్ సినిమా ఎబో యావరేజ్ అనిపించేలా సాగుతుంది. ఫస్ట్ ఆఫ్ లో కొన్నిచోట్ల తప్ప మిగిలిన చోట్ల పెద్దగా బోర్ కొట్టదు. సెకండ్ హాఫ్ బాగుంది. రాజకీయాలు.. పదవి పార్టీ కోసం వ్యక్తులు వెన్నుపోటు ఎన్నికలు నేపథ్యంలో సినిమా నడుస్తుంది. చరణ్ నటన బాగుంది.. డైరెక్టర్ శంకర్ ఒకప్పటి మార్క్ పూర్తిగా చూపించకపోయినా నిరాశపరచలేదు. ఈ సంక్రాంతి పండుగకు వన్ టైం వాచ్‌బుల్ మూవీ. తక్కువ అంచనాలతో వెళితే ఎక్కువ ఎంజాయ్ చేసి రావచ్చు.
గేమ్ ఛేంజర్ రేటింగ్ : 2.5 / 5