బాలయ్య ఊచకోత.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న డాకు మహారాజ్ కొత్త ట్రైలర్..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా మూవీ డాకు మహారాజ్.. బాబి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాను జనవరి 12న గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్‌ ముందుకు తీసుకొస్తున్నారు. సూర్యదేవర నాగ వంశీ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడు. ఇక ఫుల్ ఆఫ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమా టీజర్, పోస్టర్, సాంగ్స్ ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ అంతా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

Daku Maharaj' will do magic with emotion Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings - PakkaFilmy

ఈ మూవీ నుంచి తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా ఫ్యాన్స్ అంచ‌నాలను మరింతగా పెంచేసింది. డాకు మహారాజ్ రిలీజ్ దగ్గర పడుతున్న క్రమంలో టీం ప్రమోషన్స్ పెంచారు. తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్గా ఏర్పాటు చేసిన మేకర్స్ ఈ ఈవెంట్ మొదలుపెట్టడం కంటే ముందు డాకు మహారాజ్ నుంచి రెండో ట్రైలర్లు రిలీజ్ చేశారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంది. ఒంటి మీద 16 కత్తి పోట్లు, ఓ బుల్లెట్.. అయినా కింద పడకుండా అంతమందిని నరికేసాడంటే అతను మనిషి కాదు.. వైల్డ్ యానిమల్ అనే డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ లో యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా చూపించారు.

Daku Maharaj | తిరుపతి ఘటన నేపధ్యంలో డాకు మహారాజ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దు-Namasthe Telangana

ఇక ట్రైలర్ చేసిన ఆడియన్స్ థ‌మన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్ అంటూ.. బాలయ్య డైలాగ్స్ ప్రేక్షకులను విజిల్స్ తెప్పించేలా ఉన్నాయంట అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ నా అడ్డా.. చంపడంలో మాస్టర్ చేశా.. నువ్వు అరిస్తే బార్కింగ్ నేను అరిస్తే అంటూ బ్యాగ్రౌండ్ లో సింహపు గర్జన వచ్చిన డైలాగ్ ఇలా టైలర్‌లో బాలయ్య చెప్పిన అన్ని డైలాగ్స్ ప్రేక్షకులను మెప్పించాయి. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్ లో మరింత ఆసక్తి నెలకొంది. ఇక సినిమా ట్రైలర్ ఎలా ఉందో మీరు ఓ లుక్కేసేయండి.