టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ ఎప్పుడు మెదిలే ఏకైక ప్రశ్న డార్లింగ్ పెళ్లెప్పుడు. అవకాశం దొరికినప్పుడల్లా ప్రభాస్‌కు కావచ్చు.. అతని సన్నిహితులకు కావచ్చు మీడియా నుంచి ఎదురయ్యే ప్రశ్న కూడా ఇదే. అన్‌స్టాపబుల్ గత సీజన్ కు ప్రభాస్ వచ్చినప్పుడు కూడా బాలయ్య ఇదే ప్రశ్న అడిగారు. ఈసారి సీజన్ కు రామ్ చరణ్ వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇదే ప్రశ్న అక్కడ కూడా ఎదురయింది. అయితే ఈసారి చరణ్ ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ను లీక్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
చరణ్ నుంచి కొత్త సమాచారం బయటకు వచ్చిందట. ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వెస్ట్ గోదావరి జిల్లా గణపవరం పట్టణానికి చెందిన అమ్మాయి అంటూ.. చరణ్ టీంతో వెల్లడించినట్లు సమాచారం. నిజంగా ఇది పెద్ద క్లూనే అనడంలో సందేహం లేదు. ఏ ఊరు అమ్మాయి అన్నది మ్యాటర్ కాదు.. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు.. అసలు పెళ్లికూతురు ఎవరు అన్నది మ్యాటర్. పైగా ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పదహారణాల అచ్చ తెలుగు ఆడపిల్ల.
ఇంతకీ అసలు ప్రభాస్ పెళ్లికి సంబంధించి అన్‌స్టాపబుల్ సీజన్‌లో చరణ్ ఏమి చెప్పాడు అన్నది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభాస్ ఫుల్ బిజీగా సినిమాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఓ పక్క రాజాసాబ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్న ప్రభాస్.. మరో పక్క హనురాఘవపూడితో ఓ సినిమా, సందీప్ రెడ్డి వంగతో ఓ సినిమా లైన్‌లో ఉంచారు. ఈ సినిమాల తర్వాత సలార్ 2, కల్కి 2 సినిమాలు చేయాల్సి ఉంది, ఇంత బిజీ స్కెడ్యూల్‌తె సెట్స్ లో గడిపేస్తున్న ప్రభాస్.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో వేచి చూడాలి.