టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా మూవీ గేమ్ ఛేంజర్. డైరెక్టర్ శంకర్‌పై నమ్మకంతో చరణ్‌కు ఉన్న క్రేజ్ రీత్యా.. ఖర్చులకు వెనకాడకుండా దిల్ రాజు సినిమాను తెరకెక్కించాడు. నిజానికి ఇండియన్ 2 సినిమా డిజాస్టర్ కావడంతో.. గేమ్ ఛేంజర్ సినిమాపై ఆడియన్స్‌లో ఎన్నో సందేహాలు మొదలయ్యాయి. సినిమా పై హైప్ భాగా తగ్గింది. ఈ క్రమంలోనే ఆడియన్స్ లో సినిమా ఆకట్టుకుంటుందా.. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా స్టోరీ ఉంటుందా లేదా అనే అంశం నెటింట హార్ట్ టాపిక్ గా మారింది. ఇక ఎటకేలకు ఈ సినిమా థియేటర్స్‌లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
అయితే సినిమా ఫస్ట్ షో నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా చూసిన చాలామంది ఆడియన్స్ సినిమా నిరోత్సాహపరిచిందంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేస్తుందని అనుకున్నారు. కానీ.. ఫస్ట్ డే కలెక్షన్లు చూస్తేనే పుష్ప 2 దరిదాపుల్లో కూడా గేమ్ ఛేంజర్ లేనట్లు అర్థమయిపోతుంది. హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ తెలిపిన సమాచారం ప్రకారం.. ఫస్ట్ డే గేమ్ ఛేంజర్ రూ.47.13 కోట్ల గ్రాస్ కొల్లగొట్టినట్లు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.38 కోట్లు, హిందీలో రూ.7 కోట్లు తమిళ్లో రూ.2కోట్లు కలెక్షన్లను మాత్రమే రాబట్టింది. మార్నింగ్ షోలలో 55.82 శాతం వరకు ఆక్యుపెన్సి కనిపించినా.. మ్యాట్నీ షోలలో మాత్రం మరింతగా తగ్గిపోయింది.
39.33% మ్యాట్నీ షోలు ఫీల్ కాగా.. ఈవినింగ్‌లో కాస్త మెరుగయింది. 50.53% నమోదయింది. అయితే సినిమా టీం అఫీషియల్‌గా ఫస్ట్ డే కలెక్షన్స్ ఇలానే ప్రకటిస్తుందో.. లేదో.. వేచి చూడాలి. ఈ క్రమంలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి మరిన్ని స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్న క్రమంలో గేమ్ ఛేంజర్ అన్ని సినిమాలు కంటే పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని భావించిన మెగా అభిమానులకు ఇప్పుడు నిరాశ ఎదురయిందనే చెప్పాలి. ఫస్ట్ డేనే మరి ఇంత తక్కువ కలెక్షన్స్ రావడంతో ఆడియన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక కేవలం సాధారణ ప్రేక్షకులనే కాదు.. మెగా అభిమానులను సైతం సినిమా నిరాశపరిచిందని చెప్తున్నారు. ఇక కియారా పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోగా అంజలి పాత్ర ఓకే అన్నట్లుగా ఉందట.