టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎంతోమంది హీరోస్ తమకంటూ ప్రత్యేక ఐడెంటిటీని సంపాదించుకుంటూ రానిస్తున్న సంగతి తెలిసిందే. అలా పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ క్రియేట్ చేసుకున్నవాళ్లలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఒకరు. తాజాగా చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఫస్ట్ షో నుంచే నెగిటీవ్ టాక్ రావడంతో ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఆసక్తి తగ్గిపోయింది. అసలు సగటు ఆడియన్స్ గేమ్ ఛేంజర్ సినిమా చూడడానికి ఇష్టపడని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో డైరెక్టర్ శంకర్ తనదైన రీతిలో కథను చూపించలేకపోయాడని.. ఆయన ఏదైతే అనుకున్నాడో దానిని పూర్తిగా ఎక్స్‌ప్లోడ్ చేయలేకపోయారని విమర్శలు ఎదురవుతున్నాయి.
మొత్తానికి ఈ సినిమాతో కూడా శంకర్ డిజాస్టర్ మూట గట్టుకున్నాడని టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమా కంటే ముందు తెరకెక్కిన భారతీయుడు 2 సినిమాతో కూడా ఆయన దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మరో ఫ్లాప్ గా నిలుస్తున్న క్రమంలో.. శంకర్ పై నమ్మకం పెట్టుకొని.. ఆయన సినిమాను చూడడానికి వెళ్ళిన ఆడియన్స్ నమ్మకాన్ని వృధా చేసేసాడు అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా శంకర్ లో మునిపట్టి స్పార్క్ లేదు.. అయన అంతకముందులాగా సినియా తీయలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్నాడంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏదేమైనా ఆయన భారీ సినిమాలు కాకుండా.. చిన్న కథలతోనే మంచి అవుట్ పుట్ వచ్చేలా సినిమాలు రూపొందిస్తే మంచిదని కొంతమంది సినీ మెదవులు వెల్లడిస్తున్నారు. మరి ప్రస్తుతం వచ్చిన డిజాస్టర్లతో ఇకపై ఆయనకు డేట్స్ ఇవ్వడానికి కూడా స్టార్ హీరోలు ఆలోచించాల్సిన పరిస్థితి. ఇలాంటి క్రమంలో శంకర్ రిటైర్మెంట్ తీసుకుని రిలాక్స్ అయితే మంచిదంటూ పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా శంకర్ ఇక పైన సినిమాలు చేసి ప్రేక్షకులు మెప్పిస్తాడా.. లేదా రిటైర్మెంట్ తీసుకొని రిలాక్స్ అవుతాడా.. అన్నది చూడాలి. ఇప్పటికైతే శంకర్‌పై పూర్తిగా నెగెటివిటీ ఏర్పడింది.