నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా నటించిన మూవీ డాకు మహారాజ్. యంగ్ డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో సూర్యదేవర నాగావంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్, శ్రద శ్రీనాద్, ఊర్వశి రైతెల కీలకపాత్ర కనిపించిన సంగతి తెలిసిందే. ఫుల్ ఆఫ్ యాక్షన్ మూవీగా రూపొందిన ఈ సినిమా మరికొద్ది గంటల్లో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఈ క్రమంలోనే బాలయ్య యాక్షన్ హంగామా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలని ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. తాజాగా శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలు గ్రాండ్‌గా జరిపారు మేకర్స్. ఈవెంట్‌కు ముందే రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఒంటి మీద 16 కత్తి పోట్లు, బుల్లెట్ గాయం అయినా కింద పడకుండా అంతమందిని నరికాడు అంటే అతను మామూలోడు కాదు.. వైల్డ్ యానిమల్ అంటూ ట్రైలర్ బాలయ్య పాత్రను పరిచయం చేసే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక ఈవెంట్‌లో బాలయ్య మాట్లాడుతూ తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కీసులాట ఘటన ఎంతో బాధాకరమని వెల్లడించాడు. అది నన్ను ఎంతో బాధించిందని.. ఈ క్రమంలోనే అనంతపురంలో జరగాల్సిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేసుకున్నామంటూ వెల్లడించాడు. మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అంటూ వివరించాడు. ఇక బాలయ్య మాట్లాడుతూ నేను ఎప్పుడు ఆడియన్స్ నా నుంచి ఏం కోరుకుంటున్నారు.. ఎలా చూడాలనుకుంటున్నారనే ఆలోచిస్తానని.. ఆదిత్య 369 లో కృష్ణదేవరాయలు మారువేషం వచ్చి కృష్ణకుమార్‌ను కాపాడే పాత్ర ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ గుర్తుండిపోయింది. అందుకే అలాంటి పాత్రలు తెరపై ఫుల్ లెంగ్త్ కనిపిస్తే బాగుంటుందని భావించా. అలా డైరెక్టర్ బాబితో నేను ఈ ప్రయాణం మొదలుపెట్టా.. తెలుగు వాళ్ళ గొప్పదనం ఏంటో చూపిస్తూనే ఓ మంచి సందేశాన్ని సినిమాతో చెప్పాం.
ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ సాధించింది. ఇందులో చాలా బలమైన మహిళా పాత్రలు ఉన్నాయి. ప్రగ్యా, శ్రద్ధ, ఊర్వశీ ఇలా ప్రతి ఒక్కళ్ళు తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఇక థమన్ మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అఖండతో స్పీకర్లు బద్దలు కొట్టిన ఆయన.. ఈ సినిమాతో మరోసారి అదరగొడుతున్నాడు అంటూ వెల్లడించాడు. ఇక అఖండ సినిమా నుంచి నేనేంటో.. ఈ పరిశ్రమలో నా ప్రస్థానం ఏంటో అందరూ చూస్తూనే ఉన్నారు. ఇకపై ఇంకా చూస్తారు. ఇక ఇప్పటివరకు సంక్రాంతికి నా నుంచి వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాయి. ఇక ఈ సంక్రాంతికి వచ్చే డాకు మహారాజ్ తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆడియన్స్ అంచనాలను మించేలా ఉంటుందంటూ బాలకృష్ణ వివరించారు. ప్రస్తుతం బాలయ్య చేసిన కామెంట్లు సినిమాపై ఆడియన్స్‌లో మరింత ఆసక్తి పెంచేశాయి.